MORE HEALTHY CALVES IN FUTURE THROUGH SURROGACY-CS OF AP _ శ్రీవారి ఆశీస్సులతో దేశవాళీ గోజాతుల అభివృద్ధి- ఎస్వీ గోసంరక్షణ శాలను సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

INSPECTS SV GOSALA

 

OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE

 

TIRUPATI, 15 JULY 2023: More healthy indigenous calves are ready to emerge in near future through Surrogacy, said the Honourable Chief Secretary of Andhra Pradesh.

 

The CS, who is on a two-day visit to the temple city, visited the TTD-run SV Gosala on Saturday evening. Speaking on the occasion he said, the ambitious project taken up by the Tirumala Tirupati Devasthanams (TTD) and Sri Venkateswara Veterinary University (SVVU) to promote indigenous cattle breeds and sustain their progeny is yielding fruitful results. 

 

He said the healthy Indian cattle breeds viz. Sahiwal, Gir, Concrez etc.brought from Northern part of India to SV Gosala. In collaboration with SVVU, six calves were produced through In-vitro fertilization and embryo transfer technology, out of which five are heifer calves(females)and one is a bull calf(male). About 90% of the calves born out of this technology are heifer calves. As ovum and sexed semen technology are being utilized in this process the probability of female calves are more, he added. 

 

The CS also said another 13 cows will soon deliver calves as the surrogacy technique is applied on low-yielding cows to produce healthy progeny. The chief objective of this programme is to use desi cow milk in the Kainkaryams of Tirumala and also in Tiruchanoor soon besides the conservation and preservation of indigenous breeds, he maintained.

 

JEO for Health and Education Smt Sada Bhargavi, SV Gosala Director Dr Harnath Reddy, SVVU VC Sri Padmanabha Reddy, Gosala Trust Member Sri Sunil Reddy and others were present.

 

Earlier, the CS offered prayers in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor. JEO Sri Veerabrahmam offered prasadams to the dignitary.

 

District Collector Sri Venkatrami Reddy, DyEO Sri Govindarajan and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆశీస్సులతో దేశవాళీ గోజాతుల అభివృద్ధి

– ఎస్వీ గోసంరక్షణ శాలను సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుపతి 15 జూలై 2023: దేశవాళీ గోజాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంతో కలసి టీటీడీ చేపట్టిన ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.

శనివారం రాత్రి ఆయన ఎస్వీ గో సంరక్షణశాలను సందర్శించారు. పిండమార్పిడి ద్వారా ఇటీవల జన్మించిన ఆరు సాహివాల్ దూడలను ఆయన పరిశీలించారు. గోశాలలో గో జాతుల వసతి కోసం చేసిన ఏర్పాట్లను చూశారు.

అనంతరం డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశీయ గోజాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం రెండు సంవత్సరాల క్రితం పశు వైద్య విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం చేసుకుందన్నారు. ఇందులో భాగంగా ఉత్తర భారతదేశం నుంచి సాహివాల్ , కాంక్రీజ్, ఘిర్ లాంటి మేలు జాతి గోవులను తీసుకుని వచ్చి ప్రత్యేక సాంకేతికతో పిండమార్పిడి చేసి దేశీయ గోజాతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో 90 శాతం ఆడ దూడలే జన్మిస్తాయని చెప్పారు. ప్రస్తుతం జన్మించిన ఆరు దూడల్లో ఒకటి మాత్రమే మగ దూడ జన్మించిందన్నారు. సరోగసీ విధానం ద్వారా గర్భం దాల్చిన మరో 13 ఆవులు త్వరలో దూడలకు జన్మనివ్వబోతున్నాయన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దేశీయ పాలతో కైంకర్యాలు, ప్రసాదాలు తయారు చేయడానికి కూడా చేపట్టిన ఈ ప్రయోగం స్వామి వారి ఆశీస్సులతో సత్ఫలితాలనిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అంతకుముందు ఆయన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు డాక్టర్ జవహర్ రెడ్డి కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మనాభ రెడ్డి, టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు శ్రీ రామ్ సునీల్ రెడ్డి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీఈవో శ్రీ గోవిందరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది.