MORE PILGRIM CARE WITH PAST EXPERIENCE ON G-DAY-EO _ గ్యాలరీలలోని ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
Tirumala, 3 Oct. 19: TTD EO Sri Anil Kumar Singhal on Thursday cautioned all the officers who are deputed for Garuda Seva Duty to be more attentive in providing better amenities to pilgrims, keeping in view the past experience.
Addressing the officers in TTD Control Room opposite Rambhageecha Rest House on Thursday evening, he said the Gangaways between galleries should be taken care of for smooth distribution of food by Srivari Sevakulu. He also said, all the toilets in Tirumala should be maintained in a proper way.
The EO also instructed the concerned to ensure there is no parking problems and luggage deposition problems in the counters.
Earlier, Additional EO Sri AV Dharma Reddy briefed EO on the deployment of officers at various duty points in Tirumala for Garuda Seva.
CVSO Sri Gopinath Jatti was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గ్యాలరీలలోని ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
అక్టోబర్ 03, తిరుమల, 2019: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం జరుగనున్న గరుడసేవ రోజున, గ్యాలరీలలో వేచియున్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడిలోని వివిద విభాగాల అధికారులతో కంట్రోల్ రూమ్‌లో టిటిడి ఈవో, అదనపు ఈవో కలసి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ్యాలరీలలోని గ్యాంగ్ వేస్ లలో (ఒక గ్యాలరీ నుండి మరొ గ్యాలరీలోకి వెళ్లేందుకు దారి) దారి ఉండేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్యాలరీలలో చివరలో ఉన్న భక్తులకు సైతం అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ అందెందుకు వీలుగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్యాలరీలలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పీఏసీ – 4లో 11, నందకంలో – 6 లగేజీ కౌంటర్లను ఏర్పాటు చేశామని భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లగేజీ కౌంటర్ల వద్ద భక్తులకు ఆటంకం లేకుండా లగేజీని సకాలంలో అందించాలన్నారు. కౌస్తుభంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లలో భక్తులు తమ సెల్ ఫోన్ లను భద్ర పరుకునేలా, తిరిగి వారికి అందించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వాహనదారులకు టోకెన్ లను జారీ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు.
తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మా రెడ్డి మాట్లాడుతూ పొరటాశి మాసం, దసరా సెలవులు నేపథ్యంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, అందుకు తగ్గట్లు ఆయా విభాగాల అధికారులు మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. గరుడసేవ రోజు భక్తులందరికి టిటిడి సౌకర్యాలు అందేలా ఆయా శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో ఎస్ఈ – 1 శ్రీ రమేష్ రెడ్డి, అదనపు సివీఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, డిఎఫ్వో శ్రీ ఫణికుమార్ నాయుడు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.