MUSIC AND DANCE COLLEGE FACULTY MESMERIZES DEVOTEES _ కపిలతీర్థంలో ఆకట్టుకున్న ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకుల వాయిద్య విన్యాసం
TIRUPATI, 17 FEBRUARY 2023: The faculty of SV College of Music and Dance, on Friday captivated devotees with their versatile performances during the ongoing Kapileswara Swamy annual brahmotsavams.
As part of this annual fete, the devotional cultural programmes for the day commenced with the traditional Nadaswaram followed by Harikatha Parayanam, Flute by Sri Anantakrishna, Mridangam by Principal Sri Sudhakar, Sri Krishna on Violin and others.
Students performed Bharatanatyam to various famous notes under the guidance of Dr Usharani and mesmerized the devotees with their classical dance.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కపిలతీర్థంలో ఆకట్టుకున్న ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకుల వాయిద్య విన్యాసం
తిరుపతి, 2023 ఫిబ్రవరి 17: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ముందుగా హరికథ పారాయణం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి రవిప్రభ బృందం నాదస్వరం, శ్రీ చంద్రశేఖర్ బృందం డోలు వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు.
అనంతరం శ్రీ మంద అనంత కృష్ణ – వేణువు, డా|| కె. వి.కృష్ణ వయోలిన్ , శ్రీ యం. సుధాకర్ మృదంగం, శ్రీ జి. నటరాజ ప్యాడ్స్, తబలపై వాయిద్య కచేరి నిర్వహించారు. ఇందులో లింగాష్టకం, గంగాదీశ్వరం, రారా వేణుగోపబాల, ఏమి సేతుర లింగ, మహాప్రాణ దీపం, తందనానా అహి, జయ జనార్ధన, మగుడి (నాగస్వరం) తదితర కీర్తనలను వాయిద్యాలపై పలికించారు.
అదేవిధంగా కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఉషారాణి నృత్య పర్యవేక్షణలో విద్యార్థినులు చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఇందులో తాండవ నృత్యకారి.., కాంచ దళయతాక్షి… అర్ధనారీశ్వర…, శివపాదం, లింగాష్టకం, శివ భజన, కావడి, తందనాన అహి, మోహిని భస్మాసుర కూచిపూడి యక్షగానం తదితర కీర్తనలకు చక్కగా నృత్యం చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.