MUSICAL FEAST _ కపిలతీర్థంలో అలరించిన స‌ప్త‌వాద్య స‌మ్మేళ‌నం

Tirupati, 07 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College of Music and Dance and Sri Venkateswara Nadaswara and Dolu School on the seventh day of the annual Brahmotsavam of Sri Kapileswara Swamy were impressive.

As part of this, Srimati Srivani on Veena, Sri Ananthakrishna on Venu, Dr KV Krishna on Violin, Sri M. Sudhakar on Mridangam, Sri Shankar on Ghatam presented a mellifluous musical concert while the artists of Annamacharya Project entertained the devotees with melodious Sankeertans.

Earlier Dr K. Vandana and her disciples of the Vocal department casted divine magical spell on devotees.

Afterwards, the Bharatanatyam performance by Dr.Himabindu’s troupe, assistant professor of Sri Padmavati Women’s University, allured the audience.

In this program the principal of the college Dr.  Uma Muddubala and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో అలరించిన స‌ప్త‌వాద్య స‌మ్మేళ‌నం

తిరుప‌తి, 2024, మార్చి 07: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి వీణ‌, శ్రీ అనంత‌కృష్ణ వేణువు, డా. కె.వి.కృష్ణ వ‌యోలిన్‌, శ్రీ ఎం.సుధాక‌ర్ మృదంగం, శ్రీ శంక‌ర్ ఘ‌టం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు క‌లిసి ప్ర‌ద‌ర్శించిన స‌ప్త‌వాద్య స‌మ్మేళ‌నం భ‌క్తుల‌ను అల‌రించింది.

అంత‌కుముందు డా.కె. వంద‌న, వారి శిష్య‌బృందం గాత్ర సంగీతం రాగ‌యుక్తంగా సాగింది.

అనంతరం శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డా.హిమ‌బిందు బృందం భరతనాట్య ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.