MUTYAPU PANDIRI VAHANA SEVA HELD _ ముత్యపు పందిరి వాహనసేవలో కళానీరాజనం
TIRUMALA, 29 SEPTEMBER 2022: As a part of ongoing annual brahmotsavams in Tirumala, Sri Malayappa in Venugopala Alankara, blessed His devotees on Mutyapu Pandiri Vahanam.
Flanked by His two consorts, the processional deity swayed along the mada streets in the pleasant night.
HH Sri Chinna Jeeyar Swamy of Tirumala and other officials were present.
2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ముత్యపు పందిరి వాహనసేవలో కళానీరాజనం
తిరుమల, 2022 సెప్టెంబరు 29: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామివారి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ ప్రాంతాలకు చెందిన 17 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.
ఇందులో కర్ణాటక కనకపురాకు చెందిన పూజ-పునీత మహిళ డప్పు నృత్యం, పుదుచ్చేరికి కళాకారుల కొయ్యలాటం, మహారాష్ట్ర సోలాపుర్‌కు చెందిన లెజిమ్ పాస్క్ డ్రమ్స్, పలురకాల వాయిద్యాలతో కళాకారుల భజన భక్తులను అలరించాయి.
అదేవిధంగా, కాకినాడ మల్లెపల్లికి చెందిన మహిళలు తిన్మార్ డ్రమ్స్, తాళాలు, నృత్యం, విశాఖపట్నంకు చెందిన లలిత మహిళా భజన మండలి సభ్యులు కోలాటలు, తెలంగాణ మహబుబ్ నగర్‌కు చెందిన శ్రీ ఆంజనేయస్వామివారి భజన మండలి చెక్క భజనలు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు దేవతా మూర్తుల వేషధారణలతో అలరించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన కళాకారులు లలితా లంబోదర నృత్యం, తిరుపతికి చెందిన ఎంఎంగ్రూప్ కేరళ సంప్రదాయంలో నృత్యం ఆకట్టకున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.