MUTYAPU PANDIRI VAHANAM HELD _ ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
TIRUPATI, 12 JUNE 2022: On the fourth day evening, Sri Prasanna Venkateswara Swamy took a celestial ride on Mutyapu Vahanam.
The pleasant evening on Sunday witnessed the vahana Seva with Rukmini and Satyabhama in the guise of Sri Krishna killing Demon Bakasura.
Kankanabhattar Sri Suryakumaracharyulu, Superintendent Sri Srivani and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2022 జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం రాత్రి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణులవారు బకాసురుడిని వధించిన అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.
మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామి అమ్మవారికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.