NADANEERAJANAM_ నాదనీరాజనం వేదికపై భక్తులను తన్మయత్వంలో ముంచెత్తిన నామసంకీర్తన భక్తులను అలరిస్తున్న ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు

Tirumala, 17 October 2018: On the 8th day of the Srivari Navaratri Brahmotsavam the Nada Niranjanam open air theatre at Tirumala continued to be a center stage of bhakti sangeet, discourages, Nama sankeertans and dance performances by hundreds of artists from several states.

The dancers, singers and folk artists enthralled the devotees as a part of their devotion to Lord Venkateswara at the Nada Niranjanam, Asthana Madapams and the Mada streets in the hill shrine of Tirumala.

AT NADA NIRANJANAM

The bouquet of devotional and culture activities at Nada Niranjanam began with Mangaladwani by K Muni Kumar and G.Srinivas and team in the early hours of Wednesday, followed by Chaturveda Parayanam, recitation by the students and teachers of the Sri Venkateswara Pathashala, Dharmagiri, Tirumala.

Later, Smt K Suvarnamma team of Tirupati rendered Vishnusahasranamam while the Dharmikopanyasam was delivered by Sri Vidhyanidhi Acharya of Tirupati. In the afternoon Vizianagaram brothers presented melodious Annammaiyya Sankeertans followed by Kovai S Jayaraman and team who presented the Nama sankeertan.

In the evening, Smt Y Rama Prabha and team from Hyderabad presented sankeertans at prestigious Unjal Seva of Lord Venkateswara.

The events at the Nada Niranjanam open-air theater of Tirumala came to an end for the day with the Harikatha by Bhagavathar B Chandrasekhar of the Annamacharya Project, Tirupati.

ASTHANA MANDAPAM

At the Asthana Mandapam, the devotees got a rich experience of Bhakti Sangeet melodiously sung by T Sushma, T Sushmita and team of Hanumakonda in the morning hours.



ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీనివాసా గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా….

నాదనీరాజనం వేదికపై భక్తులను తన్మయత్వంలో ముంచెత్తిన నామసంకీర్తన భక్తులను అలరిస్తున్న ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు

అక్టోబరు 17, తిరుమల 2018: తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధ‌వారం సాయంత్రం చెన్నైకు చెందిన శ్రీ కొవై ఎస్‌.జ‌య‌రామ‌న్ బృందం నామసంకీర్తన భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. శ్రీనివాసా గోవిందా.. శ్రీవేంకటేశా గోవిందా.. అంటూ సాగిన భజన కీర్తనకు భక్తులు సైతం చేతులు కలిపి మైమరచిపోయారు. చిరుజల్లులు కురుస్తుండగా నామసంకీర్తన హోరుతో తిరుమలగిరులు పులకించిపోయాయి.

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం 5.00 నుండి 5.30 గంటల వరకు శ్రీ కె.మునికుమార్‌, శ్రీ జి.శ్రీ‌నివాస్ బృందం మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.00 గంటల వరకు తిరుపతికి చెందిన ఇ.కె.సువ‌ర్ణ‌మ్మ‌ బృందం విష్ణుసహస్రనామం, ఉదయం 7.00 నుండి 8.30 గంటల వరకు క‌డ‌ప‌కు చెందిన విద్యానిధి ఆచార్య‌ ధార్మికోపన్యాసం చేశారు.

మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు విజ‌య‌న‌గ‌రంకు చెందిన విజ‌య‌న‌గ‌రం బ్ర‌ద‌ర్స్ బృందం అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు చెన్నైకు చెందిన కొవై ఎస్‌.జ‌య‌రామ‌న్ బృందం నామసంకీర్తన జరిగింది. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవలో హైద‌రాబాదుకు చెందిన వై.ర‌మాప్ర‌భ బృందం సంకీర్తనల ఆలాపన, రాత్రి 8.00 నుంచి 9.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ జి.చంద్ర‌శేఖ‌ర్ భాగవతార్‌ హరికథాగానం చేశారు.

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో బుధ‌వారం ఉదయం 11.00 నుండి 12.30 గంటల వరకు హ‌నుమ‌కొండ‌కు చెందిన టి.సుష్మ మ‌రియు టి. సుష్మిత బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.