NADASWARAM CONCERT PERFORMED AT KAPILATIRTHA _ కపిలతీర్థంలో అల‌రించిన నాద‌స్వ‌ర వాద్య క‌చేరి

Tirupati, 10 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College of Music and Dance and Sri Venkateswara Nadaswara and Dolu School on Sunday night, the last day of Sri Kapileswara Swamy annual Brahmotsavam, were soulful.

As part of this, Sri V.  Haribabu and Sri M.Nageswara Rao band performed the Nadaswara Vaidya concert which impressed the devotees.

Similarly, college alumni Dr. R. Shyam Kumar and the Revathi team presented Sankeertans mellifluously.

After that, the Kuchipudi performance by Kumari Amulya troupe from Sri Nataraja Kalakshetra went on with a fine performance.

In this program, the principal of the college Dr. Uma Mudubala, other teachers, students and devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో అల‌రించిన నాద‌స్వ‌ర వాద్య క‌చేరి

తిరుప‌తి, 2024, మార్చి 10: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల చివ‌రి రోజైన ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వి. హరిబాబు, శ్రీ ఎం.నాగేశ్వర రావు బృందం ప్రదర్శించిన నాద‌స్వ‌ర వాద్య క‌చేరి భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంది.

అదేవిధంగా, కళాశాల పూర్వ విద్యార్ధులు డా. ఆర్‌.శ్యామ్ కుమార్‌, రేవతి బృందం వీనుల‌విందుగా భక్తి సంగీతాన్ని ఆలపించారు.

ఆ తరువాత శ్రీ న‌ట‌రాజ క‌ళాక్షేత్రానికి చెందిన కుమారి అమూల్య బృందం కూచిపూడి ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, ఇత‌ర అధ్యాప‌కులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.