NAGAVALLI DALARCHANA ON SECOND DAY _ ఆకాశగంగా శ్రీ బాలాంజనేయస్వామి ఆలయంలో వైభవంగా నాగవల్లి దళార్చన
TIRUMALA, 02 JUNE 2024: On the second day of five day Hanuman Jayanti fete at Tirumala, Naga Dalarchana was observed in Sunday.
At the Akasaganga Sri Anjanadevi sameta Balanjaneya Swamy temple, the acharya purushas performed Sahasra Namarchana with betel leaves which is known as Naga Dalarchana after performing Abhishekam.
Agama Advisor Sri Mohanarangacharyulu and others participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆకాశగంగా శ్రీ బాలాంజనేయస్వామి ఆలయంలో వైభవంగా నాగవల్లి దళార్చన
తిరుమల, 2024 జూన్ 02: హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామివారికి ఆదివారం ఏకాదశి సందర్భంగా నాగవల్లి దళార్చన (తమలపాకులతో) విశేష సహస్రనామార్చనను అర్చకులు నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, హనుమంతుని విశిష్టత, ఆకాశగంగలోని శ్రీ బాల ఆంజనేయస్వామి విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్నపన తిరుమంజనం జరిగింది. తమలపాకులతో సహస్రనామ అర్చన నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.