NAMA SANKEERTAN IS WAY TO ATTAIN SALVATION – SRI SRI SRI VIDYAPRASANNATIRTHA SWAMIJI _ శ్రీ పురందరదాసుల అరాధనా మహోత్సవాలు ప్రారంభం

Tirumala, 08 February 2024: The Pontiff of Kukke Subramanya Mutt in Bengaluru HH Sri Vidyaprasanna Theertha Swamy, emphasized that human life is a circle of problems, and to get out of these, there is a special importance to Namasankirtana in Kaliyuga as an easy tool to attain salvation.

The Aradhana mahotsavam of Sri Purandara Dasa, the great devotee of Srivaru commenced at Astana Mandapam in Tirumala under the auspices of the TTD’s Dasa Sahitya Project on Thursday.

In his Anugraha Bhashanam on this occasion, the Swamiji said Sri Purandardasa penned thousands of Sankeertans which are being sung by scores of devotees and become eligible for the divine grace.

He lauded the efforts of the members of Bhajan Mandalis for popularizing Dasa Sahitya.

On February 9, Sri Malayappa and His consorts take part in the Aradhana fete at Narayanagiri Gardens between 6pm and 8pm.

Dasa Sahitya Project Special Officer Sri Ananda Theerthacharyulu, Bhajana Mandalis and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నామ‌సంకీర్త‌న భ‌గ‌వంతునికి ప్రీతిక‌ర‌మైంది : శ్రీశ్రీశ్రీ విద్యాప్ర‌స‌న్న‌తీర్థ స్వామీజీ

– శ్రీ పురందరదాసుల అరాధనా మహోత్సవాలు ప్రారంభం

తిరుమ‌ల‌, 2024 ఫిబ్ర‌వ‌రి 08: మాన‌వ జీవితం స‌మ‌స్య‌ల వ‌ల‌య‌మ‌ని, వీటి నుండి బ‌య‌ట‌ప‌డాలంటే న‌వ‌విధ భ‌క్తిమార్గాల్లో నామ‌సంకీర్త‌న‌కు విశేష ప్రాధాన్యం ఉంద‌ని బెంగ‌ళూరులోని కుక్కే సుబ్ర‌మ‌ణ్య మఠాధిప‌తి శ్రీశ్రీశ్రీ విద్యాప్ర‌స‌న్న‌తీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యాప్ర‌స‌న్న‌తీర్థ స్వామీజీ మంగళాశాసనాలు అందిస్తూ, భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్కొంటున్నాయని, ఈ కోవకు చెందిన పరమభక్తుడు శ్రీ పురందరదాసు అన్నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వైశిష్ట్యమన్నారు. దాససాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న భజన మండళ్ల సభ్యుల కృషిని కొనియాడారు.

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. అనంత‌రం స్వామీజీని శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదంతో స‌న్మానించారు.

అంతకుముందు ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప‌లు దాస సంకీర్తనలను భజన మండళ్ల సభ్యులు చక్కగా ఆలపించారు.

ఫిబ్ర‌వ‌రి 9న సంకీర్తనాలాపన

ఆరాధ‌నోత్స‌వాల్లో రెండవ రోజైన ఫిబ్ర‌వ‌రి 9న శుక్ర‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు సంగీత‌, సాహిత్య రంగాల‌లో నిష్ణాతులైన యువ క‌ళాకారుల‌కు ప్ర‌తిభ పుర‌స్కారాలు ఇవ్వ‌నున్నారు.

అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు తిరుమ‌ల నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు శ్రీవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి శ్రీ పురంద‌ర‌దాస సంకీర్తనల బృంద‌గానం నిర్వ‌హిస్తారు.

టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3,500 వేల మందికిపైగా భజనమండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.