NANDI VAHANA SEVA OBSERVED _ నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం

నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం
          
 తిరుపతి, 2022 మార్చి 01: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి  వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన మంగళవారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు. మ‌హావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఎఈఓ శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUPATI, 01 MARCH 2022: On the auspicious occasion of Maha Sivaratri on Tuesday evening, Nandi Vahana Seva was observed with spiritual ecstasy in Ekantam in the temple city of Tirupati.

The processional deities of Sri Somaskanda Murty with Kamakshi Devi seated on the finely decked majestic Nandi Vahanam to bless the devotees.

Among all vahana sevas being observed to Lord Siva, Nandi Vahanam is considered to be most important one.

DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddy Sekhar, Sri Srinivasa Naik were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI