NARASIMHA JAYANTHI OBSERVED _ శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి

Tirumala, 6 May 20: Narasimha Jayanthi fete has been observed in Sri Tirumala temple on Wednesday evening by 5pm.

Special Abhishekam has been performed to the presiding deity of Yoga Narasimha Swamy inside the temple by Archakas. Every year this fete takes place in the holy month of Vaisakha.

The unique feature is the lord will be seen in Yoga Mudra and it was believed to have consecrated by Sri Ramanujacharya between 1330AD and 1360AD.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and temple staff took part in this celestial fete.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి

తిరుమల 2020 మే 6: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌‌వారం సాయంత్రం నృసింహ జయంతి జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.