NARASIMHA JAYANTI SPECIAL PUJA OBSERVED _ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి 

TIRUMALA, 04 MAY 2023: In connection with the Vaisakamasa Utsavams, on the auspicious occasion of Narasimha Jayanti on Thursday, special puja was performed at Vasanta Mandapam in Tirumala.

 

As part of this, Srivaru graced on Simha Vahanam while, Purana Pundit Sri Ramakrishna Seshasai explained the importance of Narasimha Avatara and later Narasimha Namavali and Sudarshana Narasimha Namavali were rendered.

 

VGO Sri Bali Reddy, devotees participated.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 2023 మే 04: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం నృసింహ జయంతి జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

వసంత మండపంలో..

వసంత మండపంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీ నరసింహ స్వామివారి పూజా నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.