NARAYANAVANAM BRAHMOTSAVAMS FROM MAY 23-31 _ మే 22న నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 20 May 2021: The annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple in Narayanavanam are scheduled from May 23 to 31.
The Ankurarpanam for the festival will be observed on May 22 while Dhwajarohanam will be performed on May 23 in Meena Lagnam between 9am and 9:30am.
Everyday morning and evening Vahana sevas will be observed in Ekantam inside the temple due to the Covid pandemic.
Important days include Garuda Vahanam on May 27 and Chakrasnanam on May 31. In the place of Rathotsavam on May 30 Sarvabhoopala Vahanam will be observed in the morning and Kalyanotsavam in the evening.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 22న నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2021 మే 20: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 22న అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మే 23 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా శనివారం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
మే 23న ధ్వజారోహణం :
మే 23వ తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు, సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
23-05-2021: ఉదయం – ధ్వజారోహణం సాయంత్రం – పెద్దశేష వాహనం
24-05-2021: ఉదయం – చిన్నశేష వాహనం. సాయంత్రం – హంస వాహనం
25-05-2021: ఉదయం – సింహ వాహనం. సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
26-05-2021: ఉదయం – కల్పవృక్ష వాహనం. సాయంత్రం – సర్వభూపాల వాహనం
27-05-2021: ఉదయం – మోహినీ అవతారం. సాయంత్రం – గరుడ వాహనం
28-05-2021: ఉదయం – హనుమంత వాహనం. సాయంత్రం – గజ వాహనం
29-05-2021: ఉదయం – సూర్యప్రభ వాహనం. సాయంత్రం – చంద్రప్రభ వాహనం
30-05-2021: ఉదయం – రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం, అశ్వవాహనం
31-05-2021: ఉదయం – చక్రస్నానం సాయంత్రం – ధ్వజావరోహణం.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.