NATURAL FARMING EXPERTS SHARE THEIR EXPERIENCE _ గో ఆధారిత ఉత్పత్తులతోనే ఆరోగ్యకర సమాజం – ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ విజయరామ్
TIRUPATI, 30 OCTOBER 2021: The two day Gosammelan on the first day witnessed thought-provoking and encouraging instances of Go Adharita Vyavasayam with many experienced, aspiring natural farmers expressing their live examples.
Gujarat based natural farmer Sri Manoj Solanki said he is been doing organic farming for the past two decades. He said the havocs and losses caused by using fertilizers.
Sri Ravi Kumar of Surabhi Gosala from Krishna district explained on how to operate gosalas successfully.
Smt Surekha Reddy from Nagarkurnool said that this movement of Goparirakshana should go ahead until Cow is declared s national animal.
While Sri Gomata Suresh hailing from Hyderabad showcased the decors he made out of cow dung and medicines from cow urine.
Sri Yuvraj from Chittoor district also given the outcome of his profits through organic farming.
Over a dozen expressed and shared their experiences with Gosalas and natural farming.
Earlier Sri Vijayaram of SAVE Organization and natural farming expert explained the benefits of Go Adharita Vyavasayam using PowerPoint presentation.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గో ఆధారిత ఉత్పత్తులతోనే ఆరోగ్యకర సమాజం – ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ విజయరామ్
తిరుపతి, 2021 అక్టోబరు 30: రసాయన ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు స్వీకరించడం వలన ఆనారోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ వేత్త శ్రీ విజయరామ్ పిలుపునిచ్చారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళన కార్యక్రమానికి హాజరైన రైతులకు ఆయన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ విజయరామ్ మాట్లాడుతూ గో మూత్రం, గో మయంతో వ్యవసాయం చేయడం వలన భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతులు తొందరగా పంటలు రావడానికి రసాయన ఎరువులు, మందులు వాడటం వలన భూసారం తగ్గి బీడు భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సుభాష్ పాలెకర్ 38 సంవత్సరాల నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ 40 లక్షల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం కల్పించారన్నారు. నేడు మనం ప్రతి గ్రామంలోను ప్లాస్టిక్, పాల్‌థిన్ కవర్లతో భూమిని నింపుతున్నామని, తద్వారా మట్టిని, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నామని చెప్పారు. గ్రామాలు గోవులతో కళ కళ లాడాలని, ఎద్దులతో సేద్యం చేయాలని సమాజానికి మంచి ఆరోగ్య కరమైన భోజనం అందించాలన్నారు.
అనంతరం ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సుభాష్ పాలెకర్ ప్రతి పాదించిన ఐదు అంచల ప్రకృతి వ్యవసాయ విధానాన్ని వీడియో ద్వారా చూపించారు. ఈ పద్దతిలో 250 గజాల భూమిలో సంవత్సరానికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ పద్దతులు, వానపాములు, జీవామృతం, పంచగవ్యాలతో వ్యవసాయం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.
గుజరాత్ రాష్ట్రం కచ్‌కు చెందిన శ్రీ మనోజ్ సోలంకి ప్రసంగిస్తూ తాను 20 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. రసాయన ఎరువుల వలన భూమిలోని మట్టి పొరలు నిస్సారమై వాతావరణ కాలుష్యం తీవ్రమవుతుందని చెప్పారు. పంచ భూతాలు ఏవిధంగా సకల జీవులను రక్షిస్తున్నాయో అదేవిధంగా గో మయం నుండి భూమి, గో మూత్రం నుండి జలం శుద్ధి చేయబడతాయని వివరించారు.
కృష్ణాజిల్లాకు చెందిన సురభి గోశాల నిర్వాహకులు శ్రీ రవికుమార్ మాట్లాడుతూ గోశాల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారు పాల విక్రయం, మేలైన గోసంతతి ఉత్పత్తి, పాడి ఉత్పత్తులు, పంటల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గో శాల ఏర్పాటుకు సబ్సిడి ఇస్తోందని, యువ రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చిత్తూరుజిల్లా మంగళంపేటకు చెందిన యువరాజ్ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతుల్లో నూనెల తయారీ, మార్కెటింగ్ అంశాలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీమతి సురేఖ రెడ్డి మాట్లాడుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అన్నారు. మానవ జాతి మనుగడకు ఎంతో సేవలందిస్తున్న గో జాతిని పరిరక్షించుకోవలసిన అవసరం మనందరి మీద ఉందన్నారు. అమ్మ ప్రాణం పోస్తే గోవు పునర్జన్మ ఇస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో గోవు పాత్ర మరువలేనిదన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన గో ఆధారిత వ్యవసాయ రైతులు ప్రసంగించారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.