NAVA KUNDATMAKA SRI YAGAM HELD AT SRI PAT _ తిరుచానూరులో వేడుకగా ప్రారంభమైన నవకుండాత్మక శ్రీ‌యాగం

– TTD CHAIRMAN COUPLE PERFORM AFTER 50 YEARS IN TIRUCHANOOR

– THE COUPLE PRESENT 34 GRAM NECKLACE TO PADMAVATHI AMMAVARU

Tirupati, 21 Jan. 22: For the time after 50 years, seeking global harmony and prosperity, Nava Kundatmaka Sri Yagam began on a grand religious note in the Sri Krishna Mukta Mandapam at Sri Padmavati temple in Tiruchanoor on Friday morning.

The seven-day fete was supervised by Agama Advisor Sri Vempalli Srinivasacharyulu in Ekantam in view of covid guidelines and live telecasted by in SVBC channel for the sake of global devotees till January 27.

As part of the fete, Sankalp Yagam was performed at 9.30 am followed by Homas, Chatustapanarchana, Agni pratista, Nitya purnahuti, Nivedana, Veda vinnapam, Maha Mangala Arathi.

Similarly in the evening also these rituals will be performed to the utsava idol of Ammavaru and later return to the sanctum.

GOLDEN NECKLACE PRESENTED BY CHAIRMAN COUPLE

The holy and majestic Yagam was performed at Tiruchanoor Ammavari temple after a gap of 50 years and on this auspicious occasion, TTD Chairman Sri YV Subba Reddy along with his better half Smt Swarnalatha presented 34-gram necklace to Goddess Padmavati.

Deputy EO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Archaka Sri Babu swami and others were present.

SRI YAGAM HAS BLESSINGS OF AMMAVARU

Sri Yagam, which has commenced in Tiruchanoor temple on Friday has blessings of Sri Padmavathi Ammavaru, said TTD Board Chairman Sri YV Subba Reddy.

Talking to media persons, he said this Yagam was performed about five decades ago in Tiruchanoor temple by the grand father of Tirumala Chinna Jeeyar Swamy, he mentioned.

He reiterated that this unique Yagam is aimed at world peace and prosperity.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో వేడుకగా ప్రారంభమైన నవకుండాత్మక శ్రీ‌యాగం

– 50 సంవత్సరాల తరువాత టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతుల చే నిర్వహణ

– అమ్మవారికి 34 గ్రాముల బంగారు హారం బహుకరించిన చైర్మన్ కుటుంబం

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 21: ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆల‌యంలో శుక్ర‌వారం నవకుండాత్మక శ్రీ యాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు జ‌రుగ‌నున్న శ్రీ‌యాగాన్ని కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చ‌కులు శ్రీ వేంపల్లి .శ్రీ‌నివాస‌న్ ఆధ్వ‌ర్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ యాగాన్ని లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9. 30 గంటలకు సంకల్పం తో యాగం ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం 1 గంట వ‌రకు యాగశాలలో సంకల్పం, హోమాలు, చ‌తుష్టానార్చ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, నిత్య‌పూర్ణాహుతి, నివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి నిర్వ‌హించనున్నారు. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు.

50 సంవత్సరాల తరువాత

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత లోక కళ్యాణం కోసం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ సుబ్బారెడ్డి దంపతులు 34 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా ఇచ్చారు. అర్చకులు ఉత్సవ మూర్తికి ఈ హారాన్ని అలంకరించారు. జనవరి 27వ తేదీ వరకు యాగం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.

అమ్మవారి అనుగ్రహం తోనే యాగం- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతోనే నవకుండాత్మక శ్రీ యాగం నిర్వహిస్తున్నాని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రారంభమైన యాగంలో శ్రీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల క్రితం చిన జీయర్ స్వామి తాత గారు ఈ యాగం చేశారని ఆయన చెప్పారు. ఆ తరువాత అమ్మవారు తమకు ఈ భాగ్యం కల్పించారని అన్నారు. దేశం, రాష్ట్రం క్షేమంగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, గో సంతతి అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నెల 27 వ తేదీ వరకు యాగం నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ వల్ల యాగం ఏకాంతంగా నిర్వహిస్తున్న దువల్ల , భక్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే అవకాశం కల్పించామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.