NAVAGRAHA HOMAM AT SRI KAPILESWARA TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం
తిరుపతి, 2019 నవంబరు 03 ;తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి 12 గంటల వరకు నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ దక్షిణామూర్తి స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.
నవంబరు 4న శ్రీ దక్షిణామూర్తి హోమం
నవంబరు 4వ తేదీ సోమవారం శ్రీ దక్షిణామూర్తి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.