NAVAGRAHA HOMAM PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE_ శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం
Tirupati, November 15, 2026: As part of the month-long Karthika Masa Homa Mahotsavams, Navagraha Homam was performed with devotion and traditional rituals at Sri Kapileswara Swamy Temple in Tirupati on Sunday.
The rituals included Purnahuthi, Kalasa Udw vasana, Maha Shanti Abhishekam and Navagraha Kalasabhishekam amidst Vedic chants.
In the evening, Kalasastapana and special Deeparadhana will be performed for Sri Dakshinamurthy Swamy.
Sri Dakshinamurthy Swamy Homam on November 16
As part of the festivities, Sri Dakshinamurthy Swamy Homam will be performed on Monday, November 16.
Temple Deputy EO Smt. Nagaratna, AEO Smt. Kumaridevi, Superintendent Sri Chandrasekhar and temple priests participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం
వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం
తిరుపతి, 2026 నవంబరు 15: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా, భక్తిభావంతో వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యాగశాలలో ఉదయం నవగ్రహ హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణలు, వైదిక క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అనంతరం సాయంత్రం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి కలశస్థాపన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
నవంబరు 16న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం
కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 16వ తేదీ సోమవారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారిదేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.





