NAVAGRAHA HOMAM HELD AT KAPILATHIRTHAM _ కపిలతీర్థంలో ఘనంగా నవగ్రహ హోమం
Tirupati, 17 January 2023: As part of ongoing Homams at Sri Kapileswara Swamy temple, Navagraha Homam was performed on Tuesday
As part of the festivities Punyahavachanam, Kalasa Sthapana Puja, Navagraha Homam, Purnahuti, Nivedana and Harati were performed.
On January 18 Sri Subrahmanya Swamy Homam will be held.
Temple DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy, Temple Archakas and officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కపిలతీర్థంలో ఘనంగా నవగ్రహ హోమం
తిరుపతి, 2023 జనవరి 17: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం నవగ్రహ హోమం ఘనంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పుణ్యాహవాచనం, కలశ స్థాపన పూజ, నవగ్రహ ఆవాహనం, అగ్ని ప్రతిష్ట, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.
జనవరి 18వ తేదీ శ్రీ సుబ్రమణ్య స్వామివారి హోమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.