NAVARATRI FESTIVALS AT TIRUCHANOOR FROM OCTOBER 11–20 _ అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
Tirupati, 2026, October 10: Navaratri festivals will be held at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor from October 11 to 20.
Snapana Tirumanjanam will be performed daily from 3 PM to 4:30 PM, followed by Unjal Seva.
On Vijayadasami, October 20, Goddess Padmavathi will bless devotees on the Gaja Vahanam at 7:45 PM.
Arjitha Sevas Cancelled
Kalyanotsavam will remain cancelled throughout the ten-day festival. Lakshmi Puja on October 16 will also be cancelled.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి, 2026 అక్టోబరు 10: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
అక్టోబరు 20వ తేదీ విజయదశమినాడు శ్రీపద్మావతి అమ్మవారు రాత్రి 7.45 గంటలకు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
నవరాత్రి ఉత్సవాల కారణంగా ఈ 10 రోజుల పాటు కల్యాణోత్సవంను రద్దు చేయడమైనది. అదేవిధంగా, అక్టోబరు 16న లక్ష్మీపూజ సేవలు రద్దయ్యాయి.
