NEW BOARD MEMBER TAKES OATH_ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడిగా శ్రీ డిపి.అనంత‌ ప్ర‌మాణం

Tirumala, 30 Sep. 19: Sri DP Anantha takes oath as a member of TTD Trust Board in Srivari temple on Monday.

Tirumala Special Officer Sri AV Dharma Reddy administered her oath in front of Lord Venkateswara inside Srivari temple. Later he was rendered Vedasirvachanam and given teertha prasadams at Ranganayakula Mandapam.

Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham, DyEO General Smt Sudharani, Reception DyEO Sri Balaji, Parpathyedar Sri Gurappa and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI


టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుడిగా శ్రీ డిపి.అనంత‌ ప్ర‌మాణం

సెప్టెంబర్ 30, తిరుమల 2019;   టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యుడిగా శ్రీ డిపి.అనంత సోమ‌వారం ఉద‌యం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గరుడాళ్వార్‌ సన్నిధిలో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

 శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ డిపి.అనంత కుటుంబ స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలను, చిత్ర‌ప‌టాన్ని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ శ్రీ‌మ‌తి సుధారాణి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, పేష్కార్ శ్రీ లోక‌నాథం, పారుప‌త్తేదార్ శ్రీ గుర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.