NEW CVSO FORMALLY MEETS EO_ టిటిడి సివిఎస్‌వోగా శ్రీ ఎ.రవికృష్ణ బాధ్యతల స్వీకరణ

Tirumala, 3 July 2017: Sri Ake Ravi Krishna took charges as new Chief Vigilance and security officer of TTD in Tirumala temple on Monday.

After offering prayers to Lord Venkateswara along with his family, he took charges as CVSO in Ranganayakula Mandapam after 9am.

Later the new Chief Vigilance and Security Officer of TTD on Monday formally met TTD EO Sri Anil Kumar Singhal in later’s chambers in TTD Administrative building in Tirupati.

He was also congratulated by JEOs Sri KS Sreenivasa Raju and Sri Pola Bhaskar.

Additional CVSO Sri Sivakumar Reddy, VGOs Sri Ravindra Reddy, Smt Sadalakshmi, Smt Vimalakumari and other CVSOs were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి సివిఎస్‌వోగా శ్రీ ఎ.రవికృష్ణ బాధ్యతల స్వీకరణ

తిరుమల, 2017 జూలై 03: టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారిగా శ్రీ ఎ.రవికృష్ణ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ముందుగా శ్రీ ఎ.రవికృష్ణ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో సివిఎస్‌వోగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆస్థానంలో భక్తులకు సేవలు అందించే అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతమన్నారు. టిటిడిలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సహకారంతో భక్తులకు భద్రతాపరంగా మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌ రెడ్డి, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, శ్రీమతి విమలకుమారి, ఎవిఎస్వోలు శ్రీ కూర్మారావు, శ్రీ నందీశ్వర్‌ రావు, శ్రీ రామచంద్రయ్య, శ్రీ చిరంజీవి, శ్రీ గంగరాజు, శ్రీ శ్రీనాథరెడ్డి, శ్రీ విజయకుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.