CVSO PAVES VISIT TO NEW DELHI TEMPLE_ న్యూఢిల్లీలోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన సివిఎస్‌వో శ్రీ రవికృష్ణ

Tirupati, 21 Jul. 17: The Chief Vigilance and Security Officer Sri A Ravikrishna paved a visit to Sri Venkateswara Swamy temple at New Delhi on Friday.

Later he held a review meeting with the vigilance staff on the security aspect. AEO Sri Anand was also present.

Earlier he took part in the national conference organised by National Police Mission under the aegis of Central Home Ministry.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
న్యూఢిల్లీలోని శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన సివిఎస్‌వో శ్రీ రవికృష్ణ

తిరుపతి, 2017 జూలై 21: దేశరాజధాని నగరమైన న్యూఢిల్లీలో టిటిడి ఆధ్వర్యంలో గల శ్రీవారి ఆలయాన్ని శుక్రవారం టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ ఆలయం వద్ద గల భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. ప్రముఖులు ఆలయాన్ని సందర్శించినపుడు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇక్కడ త్వరలో సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. సివిఎస్‌వో వెంట ఆలయ ఏఈవో శ్రీ ఆనంద్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

అంతకుముందు న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ పోలీస్‌ మిషన్‌ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ సదస్సులో సివిఎస్‌వో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 40 మంది ఐపిఎస్‌ అధికారులు ఈ సదస్సుకు విచ్చేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.