NEW EO OFFERS PRAYERS IN SRI PAT _ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్న  టిటిడి నూతన ఈవో శ్రీ కె.ఎస్. జవహర్ రెడ్డి

Tiruchanoor, 10 Oct. 20: The new Executive Officer of TTD Dr KS Jawahar Reddy, had darshan of Goddess Sri Padmavathi Devi in the temple of Tiruchanoor on Saturday evening.

He was given a traditional welcome on his arrival at the entrance of the temple. After darshan of the presiding deity, he was offered prasadams.

TTD Ex-officio member Dr C Bhaskar Reddy, JEOs Sri P Basanth Kumar, Smt Sada Bhargavi, DyEO Smt Jhansirani, VGO Sri Bali Reddy were present.

Telengana IG Sri Nagi Reddy, Acharya NG Ranga Agricultural University VC Sri Vishnuvardhan Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్న టిటిడి నూతన ఈవో శ్రీ కె.ఎస్. జవహర్ రెడ్డి

అక్టోబ‌రు 10, తిరుప‌తి 2020: టిటిడి నూతన ఈవో శ్రీ కె.ఎస్. జవహర్ రెడ్డి శ‌నివారం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న ఈవోకు ఆల‌య అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత అధికారులు నూత‌న ఈవోకు అమ్మ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో చంద్రగిరి ఎంల్ఏ మరియు టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలంగాణ ఐజి శ్రీ నాగి రెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, జెఈఓ(విద్య మరియు ఆరోగ్యం) శ్రీమతి ఎస్.భార్గవి, ఆచార్య ఎన్ జి రంగా వ్వవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి, విఎస్ వో శ్రీ బాలిరెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ఝన్సీ రాణి, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.