NEW JEO FOR HEALTH AND EDUCATION TAKES CHARGE _ జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
Tirumala, 25 January 2026: Dr A Sharat took charge as the new Joint Executive Officer for Health and Education in TTD on Sunday in Tirumala temple.
After having darshan of Sri Venkateswara Swamy, he was offered Srivari Prasadams.
Temple Peishkar Sri Ramakrishna, Board Cell AEO Smt Suseela and others were also present.
Meets TTD Chairman
Later the new JEO(H&E) has formally met TTD Trust Board Chief Sri BR Naidu at the latter’s camp office in Tirumala.
The TTD Chairman congratulated and extended his wishes to the new JEO(H&E) on the occasion.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
తిరుమల, 2026 జనవరి 25: టీటీడీ నూతన జేఈఓ (విద్య మరియు వైద్య)గా నియమితులైన డాక్టర్ ఏ.శరత్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ, బోర్డు సెల్ ఏఈఓ శ్రీమతి సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ నూతన జేఈఓ(H&E)
శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జేఈఓ(H&E) తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ నూతన జేఈఓను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.



