NEW MODEL SMC SUB-ENQUIRY COUNTER INAUGURATED _ ఆధునీక‌రించిన‌ ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 01 SEPTEMBER 2022: A new model Sub-Enquiry was inaugurated in Tirumala on Thursday at SMC area. TTD EO Sri AV Dharma Reddy, who opened the counter, instructed the Engineering officials concerned to renew other 19 Sub-Enquiry counters in Tirumala akin to SMC Sub-Enquiry counter.

 

Soon after the inauguration, devotees were allotted rooms through the new counters. The new model sub-enquiry has a seating capacity of 25 pilgrims with three counters for allotment. 

 

The inner walls are furnished with the images of deities giving a spiritual feel to the devotees and the huge portrait of “Srinivasa Kalyanam” is standing as a special attraction. SE 2 Sri Jagadeeshwar Reddy, Deputy EO R2 Sri Bhaskar, EEs Sri Surender Reddy, Sri Jaganmohan Reddy, DE Tirumala Sri Ravishankar Reddy, VGOs Sri Bali Reddy, Sri Manohar and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఆధునీక‌రించిన‌ ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 01: తిరుమ‌ల‌లో ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్ధిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రాన్నిగురువారం టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమలలోని మరో 19 వ‌స‌తి ఉప విచారణ కార్యాలయాలను కూడా ఇదే విధంగా త్వ‌రిత గ‌తిన ఆధునీక‌రించాల‌ని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ప్రారంభోత్సవం త‌రువాత‌ కొత్త కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు కేటాయించారు. నూత‌నంగా ఆధునీక‌రించిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రంలో మూడు గ‌దులు కేటాయింపు కౌంటర్లు, 25 మంది యాత్రికులు కుర్చునే విధంగా ఏర్పాటు చేశారు. భక్తులకు మ‌రింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దేవతా చిత్రాలు, “శ్రీనివాస కళ్యాణం” యొక్క భారీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న‌ది.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో(ఆర్‌-2) శ్రీ భాస్కర్, ఇఇలు శ్రీ సురేందర్ రెడ్డి, శ్రీ జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎల‌క్ట్రిక‌ల్‌) శ్రీ రవిశంకర్ రెడ్డి, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మనోహర్, రిసెప్ష‌న్ ఏఈవో శ్రీ రాజేంద్ర‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.