NEW SET OF SRIVARI PADALU IN NARAYANAGIRI _ నూతన శ్రీవారి పాదాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు

TIRUMALA, SEPT 18:  Following the scratch caused to the historically significant Srivari Padalu located in the highest peak of Narayanagiri in Tirumala, TTD has replaced the holy feet with a new set on Wednesday. Special puja has also been performed in a formal way.
 
Later addressing the media persons the TTD Chairman Sri K Bapiraju, TTD EO Sri MG Gopal and Tirumala JEO Sri KS Sreenivasa Raju said, that keeping in view the sentiments of the visiting pilgrims, TTD in quick gesture has replaced the old one with new. “It may take another three or four days for the completion of covering works. Later the devotees will be allowed as usual”, the Chairman said.
 
TTD EO said, a scratch proof glass is also under making which will cover the holy feet so that no damage is caused in future, he maintained.
 
While the JEO said, “the scratch is being caused unknowingly due to the breaking of coconuts by some pilgrims. However as per agamas there is no mention of any worship or avahana that is being carried out to these holy feet. So we have decided not to allow the pilgrims to break coconuts in this point in future”.
 
 CVSO Sri GVG Ashok Kumar was also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నూతన శ్రీవారి పాదాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు

తిరుమల, సెప్టెంబరు 18, 2013: తిరుమలలోని నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాల ఏర్పాటుకు బుధవారం తితిదే ధర్మకర్తల మండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, అర్చకబృందంతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి పాదాల నిర్మాణపనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌, ఈవో, జెఈవో మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు తిరిగి నూతన పాదాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. శ్రీవారి పాదాలకు త్వరలో కవచాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం నాటికి శ్రీవారి పాదాల ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని, ఆ తరువాత భక్తులను ఎప్పటినుండి దర్శనానికి అనుమతించాలనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు. శ్రీవారి పాదాలకు ఆగమశాస్త్రాల్లో ప్రత్యేకంగా ఆరాధనా విధానం లేదని, ఈ కారణంగా భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టకుండా నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌ కుమార్‌, ఆగమ సలహాదారు శ్రీ సుందరవదన భట్టాచార్య, ఓఎస్‌డి శ్రీ శేషాద్రి, అర్చక బృందం ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.