NO DARSHAN TOKENS ON G-DAY

Tirumala, 14 September 2018: In view of heavy influx of pilgrims being anticipated for Garuda Seva on September 17, TTD will not issue any darshan tokens on that day, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

He informed that the Divya Darshan and Sarva Darshan tokens will not be issued on September 16 and 17 while the Rs.300 special entry darshan tickets on September 17.

From September 18 to 21, only 7000 numbers each of Sarva Darshan tokens and Rs.300 Special Entry Darshan tickets will be issued per day. While 20thousand divya darshan tokens including 14000 in Alipiri and 6000 in Srivari Mettu footpath routes will be issued from September 18 onwards.

The pilgrims are requested to make note of these changes and plan their pilgrimage to Tirumala accordingly.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 17న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 16, 17వ తేదీల్లో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవని తిరుమల జేఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు తెలియజేశారు. అదేవిధంగా సెప్టెంబరు 17న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఇవ్వబడవన్నారు.

సెప్టెంబర్ 18, 19, 20, 21 తేదీలలో(రూ. 300/-) ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను, సర్వదర్శనం టోకెన్లను రోజుకు 7 వేల చొప్పున జారీ చేస్తామన్నారు.

గరుడసేవ తర్వాత యధావిధిగా దివ్యదర్శనం టోకెన్లు రోజుకు 20 వేలు జారీ చేస్తామన్నారు.