NO DIVYA DARSHAN TOKENS ON TWO PERATASI SATURDAYS DURING BRAHMOTSAVAMS AND ON GARUDA SEVA DAY-TIRUMALA JEO_ శ్రీవారి బ్రహ్మూత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు : తిరుమల జె.ఇ.ఓ

Tirumala, 19 September 2017 : Tirumala JEO Sri KS Sreenivasa Raju said that keeping in view the anticipated pilgrim influx during the ensuing annual brahmotsavams coupled with Peratasi Saturdays, TTD has cancelled Divya Darshan tokens on these two days and also on Garuda Seva day.

Speaking to media after the review meeting on the arrangements for the ensuing Brahmotsavams at Annamaiah bhavan in Tirumala on Tuesday evening, the JEO said, on September 23, September 27 and September 30 the management will not issue divya darshan tokens for pedestrian pilgrims owing to pilgrim rush. ‘TTD will make all arrangements for food and other comforts but they will have to join the sarva darshan queues for darshan’, he said.

Adding further he said, It has also been decided to limit the number of Rs.300 special darshan tickets during the Brahmotsavams.

He said when the Divya darshan token scheme was launched in 2008 itself it was declared that for 7 days including four Peratasi Saturdays, Garuda seva, Vaikunta Ekadasi and the New year, no divya darshan tokens would be issued for pilgrims trekking footpath routes.

The JEO said that even VIP break darshan will be strictly as per protocol ,Other privileged darshan like Arjita sevas, Aged, physically challenged and parents with children below five years were also suspended during the Brahmotsavams.

He said 90 % of the works were completed and rest will be done in a day or two. Fool proof arrangements have been made for serving drinking water, food, coffee,tea, milk and butter milk for devotees sitting in galleries of Mada Streets during the nine day festival and particularly on Garuda seva day, he added.

Among others who participated in the review meeting were Chief Engineer Sri Chandrasekhar Reddy, FA and CAO Sri O Balaji, SE-2 Sri Ramachandra Reddy, Dy EO temple Sri Kodandarama Rao and other TTD officials.


ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు : తిరుమల జె.ఇ.ఓ

సెప్టెంబర్‌ 19, తిరుమల, 2017 : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల జెఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మూత్సవాలతో పాటు, పెరటాశి మాసం వస్తుండటంతో భక్తులు విశేష సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మూత్సవాలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పరిమితంగా భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. దివ్యదర్శనం భక్తులకు 2008 ఏడాదిలో తీసుకున్న నిర్ణయం మేరకు పెరటాశి నెలలో వచ్చే నాలుగు శనివారాలు, గరుడసేవ, వైకుంఠఏకాదశి, నూతన సంవత్సరం లాంటి 7 రోజులలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడవన్నారు. అందులోభాగంగా ఈ బ్రహ్మూత్సవాలలో 23వ తేదీన వచ్చే శనివారం, 30వ తేదీ వచ్చే శనివారం, 27న గరుడసేవ రోజు కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదన్నారు. ప్రొటోకాల్‌ పరిధిలో వచ్చే విఐపిలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలను పరిమితం చేస్తామని, వ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ప్రవాసాంధ్రులు, డిఫెన్స్‌, దాతలకు ప్రివిలేజ్‌డ్‌ దర్శనాలను రద్దు చేశామన్నారు. ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు.

తిరుమలలో గరుడసేవ రోజు భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా నాలుగు చక్రాల వాహనాలను 7 వేల వరకు అనుమతించి, ఆపైన వచ్చే వాహనాలను తిరుపతిలోని దేవలోక్‌, అలిపిరి భారతీయ విద్యాభవన్‌ ప్రాంతంలో పార్కింగ్‌ చేయవలసి ఉంటుందన్నారు. దేవలోక్‌, భారతీయ విద్యాభవన్‌లో పార్క్‌ చేసిన వాహనదారులు అక్కడ నుంచి ఏర్పాటు చేసిన బస్సులలో నగదు చెల్లించి తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రహ్మూత్సవాలలో ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌, వసతి, ఆరోగ్యవిభాగం, అన్నప్రసాదాల శాఖల అధికారులు మరింత అప్రమత్తంగా సేవలు అందించాలని సూచించారు. తిరుమలలో ప్రైవేట్‌ దుకాణాదారులు భక్తులకు అధిక ధరలకు విక్రయించకుండా తగుచర్యలు తీసుకోవాలని ఎస్టేట్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలో (ప్రస్తుతం ఉన్నవాటితోపాటు, సంచార వైద్యశాలలు )దాదాపు 18 వైద్యశాలల ద్వారా వైద్యసేవలు అందిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఎ,సిఎవో శ్రీ బాలాజీ, ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, శ్రీ వెంకటయ్య, శ్రీ హరీంధ్రనాథ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ జిఎం శ్రీ శేషారెడ్డి, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణ, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.