NO RECOMMENDATION LETTERS ENTERTAINED FROM DEC 22 ONWARDS_ డిసెంబరు 23 నుంచి బ్రేక్‌ దర్శనాలు ప్రొటోకాల్‌ ప్రముఖులకు పరిమితం

Tirumala, 20 Dec. 17: In view of heavy pilgrim rush being anticipated to the hill town of Tirumala following half-yearly holidays, TTD has resolved to restrict VIP break darshan to Protocol VIPs only from December 23 onwards.

The VIP recommendation letters will not be entertained from December 22 on wards in Tirumala. Following the week end pilgrim rush and as important occasions like Vaikuntha Ekadasi, Dwadasi, New Year days have also lined up, the management has taken this decision in the larger interests of common pilgrims.

The cancellation of break darshan on references continues until further decision by the management. It may be mentioned here that during peak summer holiday TTD had restricted VIP break darshan to protocol VIPs for 40 days to facilitate more darshan time to common pilgrims. The decision to revive VIP break darshan will be reviewed by TTD in the first week of January 2018.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 23 నుంచి బ్రేక్‌ దర్శనాలు ప్రొటోకాల్‌ ప్రముఖులకు పరిమితం

తిరుమల, 2017 డిసెంబరు 20: సంవత్సరాంతంలో శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 23వ తేదీ శనివారం నుంచి బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. కావున గోకులం భవనంలోని జెఈవో కార్యాలయంలో శుక్రవారం నుంచి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ నిర్ణయాన్ని జనవరి మొదటి వారంలో టిటిడి తిరిగి సమీక్షిస్తుంది.

అదేవిధంగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా డిసెంబరు 28 నుంచి జనవరి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆర్జితసేవలను, దివ్యదర్శనం టోకెన్లను టిటిడి రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవని తెలియజేసింది.

వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడంతో ఏకాంతంగా అభిషేకం నిర్వహించిన తరువాత ప్రముఖులకు బ్రేక్‌ దర్శనం ప్రారంభిస్తారు. లఘు దర్శనం మాత్రమే అమలుచేస్తారు. హారతి ఉండదు. మహద్వార ప్రవేశం ఉండదు. టికెట్లపై సూచించిన మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. లక్షకు పైబడి వేచియుండే సామాన్య భక్తుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖులు సహకరించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.