No Two wheelers to Tirumala on Garudotsavam Day _ గరుడసేవ రోజున తిరుమలకు ద్విచక్రవాహనాల నిషేధం
గరుడసేవ రోజున తిరుమలకు ద్విచక్రవాహనాల నిషేధం
తిరుపతి, 2012 సెప్టెంబరు 20: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబరు 22వ తేదీన జరుగనున్న గరుడసేవ సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ భక్తుల భద్రత దృష్ఠ్యా గరుడసేవ రోజు తిరుమలకు ద్విచక్రవాహనాలను సెప్టెంబరు 21వ తేదీ రాత్రి 120 గంటల నుండి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కారణంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్.టి.సి. వారిచే తిరుపతి తిరుమల మధ్య నిమిషానికో బస్సు నడుపనున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతి నగరంలో 12 ప్రాంతాల్లో ఆర్.టి.సి.వారు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిలో అన్నారావు సర్కిల్, కపిలతీర్థం, రుయా ఆస్పుత్రి, వేదిక్ యూనివర్శిటీల వరకు ద్విచక్రవాహనాలను అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.