NO VIP BREAK ON OCT 24, 25 AND NOV 8 _ అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

TIRUMALA, 19 OCTOBER 2022: TTD has cancelled VIP Break Darshan on October 24, 25 and November 8 in view of Deepavali Astanam, Solar and Lunar eclipses respectively.

As Deepavali Astanam will be held in Tirumala temple on October 24, TTD has cancelled VIP Break Darshan Tickets. No recommendation letters will be entertained on October 23. 

Similarly, the temple remains closed for almost 12 hours from 8am to 7:30pm on October 25 following Solar Eclipse. No recommendation letters for VIP Break Darshan will be entertained on October 24. 

As Lunar eclipse occurs on November 8, the temple doors remains closed from 8:30am to 7:30pm. So no recommendation letters for VIP Break darshan will be accepted on November 7.

TTD has also cancelled SRIVANI and Rs.300 darshan tickets on October 25 and November 8 following Solar and Lunar eclipses.

Devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమల, 2022 అక్టోబరు 19: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను టిటిడి రద్దు చేసింది.

అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సూర్యగ్రహణం రోజున ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు దాదాపు 12 గంటలు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబ‌రు 8న చంద్ర‌గ్రహణం రోజుల్లో శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను కూడా టిటిడి రద్దు చేసింది.

భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.