NODAL GHOSHALA OPERATORS SHOULD PROMOTE ORGANIC FARMING- TTD JEO VEERABRAHMAM _ నోడల్ గోశాలల నిర్వాహకులు గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి – టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 26 August 2022: TTD JEO Sri Veerabrahmam urged Nodal Ghoshala operators to visit other Ghoshals frequently and encourage the farmers to take up Cow based organic farming.

 

He was addressing the valedictory session of the two-day training program for Nodal Ghoshala Operators held at the SVETA Bhavan under the aegis of the SV Gosamrakshanashala on Friday evening.

 

He asked the Nodal Ghoshala organisers to focus in Panchagavya products and that both the TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy had laid special focus on Gosamrakshana and Goshala development activities as a part of the protection of Hindu Sanatana Dharma.

 

He said TTD had made all arrangements for the purchase of the organic products. If the Ghoshalas finds difficulty in the maintenance of Cows, TTD is ready to take these animals and donate them freely to organic farmers.

 

He said TTD would conduct monthly sessions with Nodal Goshala Operators to sort our hurdles if any.

 

Several Nodal Goshala Operators also spoke about their problems and also gave some valuable suggestions.

 

Gosamrakshana Trust Member Sri Ram Sunil Reddy, SV Goshala Director Dr Harnath Reddy, SVETA Director Smt Prashanti, Veterinary University Extension Director Dr Venkata Naidu were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నోడల్ గోశాలల నిర్వాహకులు గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి- టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 26 ఆగస్టు 2022: నోడల్ గోశాలల నిర్వాహకులు తమ పరిధిలోని ఇతర గోశాలలను తరచూ సందర్శిస్తూ రైతులు గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం పిలుపు నిచ్చారు .

టీటీడీ ఆధ్వర్యం లోని ఎస్వీ గోసంరక్షణ శాల ఆధ్వర్యంలో శ్వేతా లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ముగిసింది . ఈ సందర్బంగా శ్రీ వీర బ్రహ్మం నోడల్ గోశాలల నిర్వాహకులనుద్దేశించి మాట్లాడారు . నోడల్ గో శాలలు గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల తయారీ మీద దృష్టి పెట్టాలని చెప్పారు . టీటీడీ పాలక మండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి గో సంరక్షణ , గోశాలల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు .

గో ఆధారిత పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు . గోవుల పోషణ ఇబ్బందిగా ఉన్న గోశాలల్లోని గోవులను టీటీడీ గోశాలకు తరలించి , గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా అందించేలా కృషి చేయాలన్నారు . నోడల్ గోశాలల నిర్వాహకులతో ప్రతి నెల నేరుగా గానీ వర్చువల్ గా కానీ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కార మార్గాలు ఆలోచిస్తామని శ్రీ వీరబ్రహ్మం చెప్పారు .

పలువురు నోడల్ గోశాలల నిర్వాహకులు వారి సలహాలు సూచనలు సమస్యల గురించి మాట్లాడారు . అనంతరం వీరికి ఆయుర్వేద మందుల కిట్లు అందజేశారు .శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ కమిటీ సభ్యులు శ్రీ రామ్ సునీల్ రెడ్డి , గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి శ్వేతా డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి , పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకట నాయుడు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది