ONE-DAY PAVITROTSAVAMS HELD AT NARAYANAVANAM _ శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

TIRUPATI, 20 SEPTEMBER 2021:  One-day annual Pavitrotsavam was held at Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam on Monday.  

 

As part of the festivities, Vaidika programmes held in Yagashala in the morning followed by Snapana Tirumanjanam to the utsava deities.

 

Later in the afternoon, Pavitramala Samarpana was held. There will be procession of deities within the temple premises due to Covid restrictions.  

 

Special Grade DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Nagaraju and archakas took part.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 20: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించారు.

ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి మూలమూర్తుల‌కు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ విష్ణుబ‌ట్టాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ నాగ‌రాజు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.