ONLINE BOOKING OF ALL TTD KALYANA MANDAPAMS IN A PHASED MANNER- TTD EO SRI ANIL KUMAR SINGHAL_ టిటిడి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు చర్యలు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశం

Tirupati, 19 February 2018: TTD Executive Officer Sri Anil Kumar Singhal today said that online booking of TTD Kalyana mandapams should be underaken for all districts in a phased manner.

Addressing TTD IT officials during a review of the Online booking of TTD kalyana mandapams at the TTD admin building today TTD EO said henceforth every two months TTD kalyana mandapams in two districts will be brought online booking.

The EO also directed the officials to promote Srivari Bhakti literature by distributing TTD books at all district libraries.

Since the slotted Sarva Darshan (SSD)with time slots will commence from March 2nd week the EO advised officials to gear up installation of equipmens like IRIS scanner and bio metric to speed up the processing at all counters.

He also asked the Electricity Dept to ensure underground laying of power lines and guard against any power outages and short circuit damages. He also advised that sign boards in several south indian and north indian languages be put up all over Tirumala with assistance of Srivari Sevakulu. He also urged the Engineering dept officials to remove all obstacles in the path of devotees when they all let off from Vaikuntham Que Complex for Srivari darshan inside the temple.

The EO also wanted the officials to get a report from the experts of BHEL for setting up a model Boondi complex in Tirumala in addition to the existing one.

The EO also wanted a a thorough compilatin of TTD assets, infrastructure and goods in the (Tools and Plants) register.

Among others Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Ake Ravikrishna FACAO Sri O Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy and others participated.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి కల్యాణమండపాల ఆన్‌లైన్‌ బుకింగ్‌కు చర్యలు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశం

ఫిబ్రవరి 19, తిరుపతి, 2018: చిత్తూరు జిల్లాలోని టిటిడి కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం కల్పించామని, అదేతరహాలో ప్రతి రెండు నెలలకు రెండు జిల్లాల చొప్పున అన్ని ప్రాంతాలలోని కల్యాణమండపాలను ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునేలా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఐ.టి, ఎస్టేట్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు శ్రీవారి భక్తి సాహిత్యాన్ని మరింత చేరువచేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కేంద్రాలలోని గ్రంథాలయాలలో టిటిడి పుస్తకప్రసాదాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. శ్రీవారి దర్శనార్థం సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్‌ విధానాన్ని మార్చి రెండోవారం నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో కౌంటర్లలో అందుకు అవసరమైన ఐరిష్‌ గుర్తింపు, వేలిముద్రణ గుర్తింపు తదితర పరికరాలు, ఇతర మౌళికసదుపాయాలను సమీకరించుకోవాలని ఆదేశించారు. తిరుమలలో విద్యుత్‌ ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా విద్యుత్‌ వైర్లు బయట కనిపించకుండా వైరింగ్‌ విధానాన్ని అమర్చాలని ఎలక్ట్రికల్‌ విభాగం అధికారులకు సూచించారు. తిరుమలలోని ప్రముఖ ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేలా వివిధ భాషలు తెలిసిన శ్రీవారి సేవకుల సహకారంతో సర్వే నిర్వహించి అవసరమైన చోట్ల ప్రముఖ భాషలలో సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ క్యూలైన్ల నుంచి శ్రీవారి దర్శనానికి వదిలే సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

తిరుమలలో బూందీ కాంప్లెక్స్‌ నిర్మాణ నమూనాల కోసం బీహెచ్‌ఈఎల్‌ నిపుణులతో అధ్యయనం చేయించి నివేదిక రూపొందించాలని సంబంధిత అధికారులను కోరారు. టిటిడి ఆస్తులు, వస్తువులు, పరికరాలను గుర్తించేందుకు వీలుగా టూల్స్‌ అండ్‌ ప్లాంట్స్‌ (టి & పి)రిజిస్టర్‌లో పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, ఎఫ్‌ఏ అండ్‌ సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.