ONLINE QUOTA OF SEVA TICKETS FOR SEPTEMBER _ జూన్ 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 16 JUNE 2023: The Srivari Arjitha Seva tickets Electronic DIP Registrations for the month of September will be available for registrations with effect from 10am of June 19 till 10am of June 21.

The Srivari Arjitha Seva tickets quota for the Sevas like Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam, and Sahasra Deepalankara Seva will be available for booking from 10am of June 22 while the Angapradakshinam tokens will be available for booking on 10am of June 23. 

The Online Seva (Virtual participation) and connected Darshan quota for Kalyanothsavam, Unjal Seva, Arjitha Brahmotsavam & Sahasra Deepalankara Sevas in Tirumala temple will be released at 3pm on June 22.

PAVITROTSAVAM TICKETS:

The annual Pavitrotsavams will be conducted from August 27 to 29 and the seva tickets will be released online on June 22 at 10am. The devotees are requested to make note of the above details and book their darshan and seva tickets only on TTD official website https://tirupatibalaji.ap.gov.in 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2023 జూన్ 16: భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు.

సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 

కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదల

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల  చేయబడినది.