ONLINE QUOTA OF SEVA TICKETS FROM FEB 22-28 _ ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల ఇలా..

TIRUMALA, 07 FEBRUARY 2023: TTD is set to release the online quota of arjita seva tickets of various formats for the period February 22-28 on different dates as follows.

The Online Arjita Seva (virtual participation) and connected darshan quota for Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara sevas at Srivari Temple in Tirumala will be available for booking from February 22 to 28 by 10 AM on February 9.

The registration for Srivari Arjita Seva Tickets in Electronic DIP for February 22-28 will be open from 10am February 8 to 10am February 10.

Srivari Arjitha Seva tickets from February 22-28 is available for booking from 12noon of  February 8 (in FIFO method).

The devotees are requested to make note of this and book the arjita seva tickets accordingly through TTD web address:

http://tirupatibalaji.ap.gov.in

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల ఇలా..

తిరుమల, 07 ఫిబ్రవరి 2023: ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు గల వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను టిటిడి విడుదల చేయనుంది.

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత సేవలైన (వర్చువల్ పార్టిసిపేషన్) కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాతోపాటు, ఈ సేవల ద్వారా లభించే దర్శన కోటాను ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు.

ఎలక్ట్రానిక్ డిప్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.

ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్‌లైన్ లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచుతారు.

భక్తులు ఈ విషయాన్ని గమనించి http://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.