ONLINE QUOTA SRIVARI ARJITA SEVA TICKETS FOR THE MONTH OF SEPTEMBER, 2019 IN TIRUMALA TEMPLE_ ఆన్‌లైన్‌లో 70,918 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల_
Tirumala, 7 Jun. 19: TTD has released online quota of Arjitha Seva tickets for the month of September on Friday at 10 am. A total of 70,918 tickets were released out of which 10,618 tickets were released on Online dip system.This included Suprabatham – 7,898 Tomala – 120, Archana -120, Astadala Pada Padmaradhana – 180
Nija Paada Darshanam – 2,300.
And 60,300 tickets in the online general category.
Vishesha puja – 2,000
Kalyanam – 13,775
Unjal seva – 4,350
Arjita Brahmotsavam – 7,975
Vasantotsavam – 15,400
Sahasra deepalankara seva – 16,800
Details of registration for Arjita seva tickets
• June 7,10.00 a, Release of online Arjita seva quota
• Date for registration for electronic dip:June 11, 10.00 am
• Electronic dip: June 11– 10.00-12 noon .
• Cash payments: June 11, 12.00 to June 14 1200 noon .
September online quota of Arjita seva tickets in TTD local temples .
• They include Sri Govindarajaswamy temple,Sri Prasanna Venkateswara temple Srinivasa Mangapuram,Appalayagunta Sri Kalyana Venkateswara temple,Tiruchanoor Sri Padmavathi Ammavari temple,Srinivasa temple,Sri Suryanarayana Swamy temple and Vontimetta Sri Kodanda Rama Swami temple.
September quota of Srivari Sevakulu allotments
• TTD has also released the September online allotment quota for Srivari Sevakulu in the General Seva, Parakamani Seva, Laddu Prasada Seva, Pilgrim Welfare Facilitation Seva and also for annual Brahmotsavams this year.
TTD Kalyana mandapam online booking.
• TTD has provided online booking facilities for all 302 Kalyana mandapams in Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Kerala, and Odisha.
• Devotees can book 90% online and 10% directly across the counters.
Minor changes in room bookings at Tirupati from July 1st.
• Minor changes have been introduced in rooms bookings at Vishnu Nivasam, Srinivasam, Madhavam Rest Houses from July 1.
• All bookings are current and across the counter at Vishnu Nivasam. There is no online facilitation at Vishnu henceforth. Also, rooms are given on 24 hours basis only.
• Devotees can book rooms online at Srinivasam and Madhavam on 24 hour basis only that is from morning 8am to next day 8 am slot system.
• Even if they land later than booked hours, they have to vacate promptly at scheduled time only.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డయల్ యువర్ ఈవో ముఖ్యాంశాలు
తిరుమల, 2019 జూన్ 07: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం :
– ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో 25.89 లక్షల మంది భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించాం. టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, శ్రీవారిసేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సమన్వయంతో పనిచేసి భక్తులకు సేవలందించారు. వారికి ప్రత్యేక అభినంధనలు.
తిరుమల శ్రీవారి ఆలయంలో :
– తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 14 నుండి 16వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం మహోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ :
– జూన్ 9 నుండి 13వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ శాస్త్రోకంగా జరుగనుంది. ఈ వైదిక కార్యక్రమాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.
2 లక్షలకు సప్తగిరి మాస పత్రిక పాఠకులు :
– ధర్మ ప్రచారంలో భాగంగా సప్తగిరి మాస పత్రిక చందా దారులు 2 లక్షలకు చేరారు. క్రమం తప్పకుండా పాఠకులకు మాస పత్రిక చేరేలా పటిష్ట చర్యలు చేపట్టాం. ప్రతి చందా దారుడి చిరునామా, ఫోన్ నెంబరు, తదితర వివరాలు అప్‌డేట్ చేశారు. పాఠకులను ఆకర్షించేలా శ్రీవారి ప్రత్యేక కథనాలతో మాస పత్రికను తీర్చిదిద్దుతున్నాం.
తిరుచానూరులో భక్తులు వేచి ఉండేందుకు ప్రత్యేక హాల్ :
– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆస్థానమండపంలో 600 మంది కుర్చునేందుకు వీలుగా ప్రత్యేక హాల్‌ను అందుబాటులోనికి తీసుకువచ్చాం.
టిటిడి అనుబంధ ఆలయాలలో ఉత్సవాలు :
– జూన్ 9 నుండి 13వ తేదీ వరకు హైదరాబాదులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మూెత్సవాలు.
– జూన్ 13 నుండి 17వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు
– జూన్ 13 నుండి 21వ తేదీ వరకు అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మూెత్సవాలు.
– జూన్ 23 నుండి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు.
ఆన్‌లైన్‌లో టిటిడి స్థానికాలయాల సెప్టెంబరు నెల ఆర్జితసేవా టికెట్లు :
– టిటిడి స్థానికాలయాలకు సంబంధించిన సెప్టెంబరు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాం.
– ఇందులో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయం,
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ ఆర్జితసేవా టికెట్లు ఉన్నాయి.
సెప్టెంబరు నెల కోటా విడుదల :
– సెప్టెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆలయం, స్థానికాలయాల ఆర్జితసేవలతోపాటు శ్రీవారి సేవ, పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ, పిడబ్ల్యుఎఫ్‌ఎస్ ఆన్‌లైన్ కోటాను ఈ రోజు విడుదల చేస్తున్నాం.
– సెప్టెంబరు నెలకు సంబంధించిన వసతి, రూ.300/- టికెట్లు ఆన్‌లైన్ కోటాను జూన్ 11వ తేదీన విడుదల చేస్తాం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.