ONLINE SYSTEM INTRODUCED TO ENHANCE TRANSPARENCY IN SRIVARI SEVA-TTD EO _ ఆన్ లైన్ ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయింపు- డయల్ యువర్ ఈవోలో శ్రీ ఏవి ధర్మారెడ్డి

TIRUMALA, 04 AUGUST 2023: The online system is introduced in the booking of Srivari Seva voluntary service with an aim to enhance transparency and to provide an opportunity to more number of devotees to render free service as volunteers to their fellow pilgrims, said TTD EO Sri AV Dharma Reddy.

During the live phone-in program, Dial your EO held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO attended the calls of 35 pilgrim callers from across the country. When callers Smt Aparna, Sri Ramprasad from Hyderabad, Sri Janardhan Reddy from Nandyal, Smt Saroja from Kurnool said that online bookings in Srivari Seva, whenever the quota is released, are getting completed within two to three minutes and consider off-line system also. Answering the callers, the EO said, Online system has been introduced to enhance transparency in Srivari Seva. “Srivari Seva was commenced by TTD over two decades ago with a noble aim to render free services to pilgrims with fellow pilgrims who registered as volunteers. But due to increase in demand for Srivari Seva, some miscreants started collecting money from sevaks and booking them seva offline. To curb this practice even in a voluntary service area like Srivari Seva, the online system was introduced.

The EO also said, the online application in Srivari Seva is cent percent genuine and nobody can hack it and book sevaks illegally. He also said he will instruct the employees to behave with Srivari Sevaks with poise and dignity who come from far off places to render services to pilgrims out of dedication and devotion.

Callers Sri Kasi Vishwanatha Sharma and Sri Mohan from Guntur brought to the notice of EO about the improper maintenance of rooms in Sapthagiri, the EO said, TTD has renovated 6000 cottages at Rs.120crore in the last four years and will soon take up the repairs of Sapthagiri also.

When Sri Syam Kumar from Hyderabad sought EO to release certain quota for senior citizens in offline, the EO said, the senior citizens shall also procure SSD tokens or SED tickets and they will be sent through bio-metric for darshan with the help of Srivari Sevaks on producing tickets or tokens and it is not possible to release offline quota for Senior citizens and Angapradakshina also.

When Sri Sudarshan from Hyderabad asked EO to resume devotional movies on Sundays in SVBC, the EO said, movies shall be watched in any other channels or in youtube also. But now TTD has redefined the SVBC in such a way that the experts are giving pravachanams from epics like Ramayana, Mahabharata, Bhagavat and other puranas which won the hearts of millions and millions of Srivari devotees across the globe increasing the viewership in an incredible way.

Sri Anand from Karnataka poured in appreciation for TTD and its facilities and SVBC. He sought EO to provide information about the darshan timings, arjita sevas, etc.in Kannada new bulletin also to which EO readily agreed to implement the same.

The other queries included free bus facility, tonsuring, lucky dip tickets etc.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao and other officials were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆన్ లైన్ ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయింపు

– సేవ కొరకు ఎవ్వరికి డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు

– డయల్ యువర్ ఈవోలో శ్రీ ఏవి ధర్మారెడ్డి

తిరుమల, 2023 ఆగష్టు 04: స్వచ్ఛంద సేవ అయిన శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కొరకు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని, ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని టీటీడీ ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

శ్రీవారి సేవ ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయించడం జరుగుతుందని, ఎవరైనా డబ్బులు తీసుకుని సేవ తీసిస్తామంటే భక్తులు నమ్మవద్దని ఆయన చెప్పారు. సేవ సాప్ట్ వేర్ కచ్చితంగా ఉంటుందని, టీటీడీ సర్వర్ ను ఎవరు
హ్యాక్ చేయలేరన్నారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా అమ్మ అని పిలవాలన్నారు.

1.శ్రీ కాశీ విశ్వనాధ శర్మ – గుంటూరు
శ్రీ మోహన్ – గుంటూరు

ప్రశ్న : సప్తగిరి విశ్రాంతి భవనంలోని గదులలో హీటర్స్, వెస్ట్రన్ టాయిలెట్స్, కబోర్డ్స్, ఫర్నిచర్ లేవు ఏర్పాటు చేయండి?

ఈవో : తిరుమలలో ఇయటివలే రూ.120 కోట్లతో 6 వేల గదులను ఆధునీకరించడం జరిగింది. సప్తగిరి విశ్రాంతి భవనంలోని గదుల ఆధునీకరణకు టెండర్లు పిలిచాము, మరో ఆరు నెలల్లో గదుల ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయి.

2. శ్రీ సెల్వ కుమార్ – ఏలూరు,

ప్రశ్న : ఆన్ లైన్ లో సేవా టికెట్లతో పాటు దర్శనం, వసతి విడుదల చేయండి?

ఈవో: తిరుమల, తిరుపతిలో వసతి పొందేందుకు ఆన్లైన్ లో ఒకేసారి విడుదల చేస్తున్నాం.

3. శ్రీ రాము – వైజాగ్

ప్రశ్న : తిరుమలలో స్నానపు గదులు అపరిశుభ్రంగా ఉన్నాయి?

ఈవో : ఇటీవల సులబ్ సంస్థలో విధులు నిర్వహించే కార్మికులు సమ్మె చేయడం వల్ల భక్తులకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ప్రస్తుతం అంత బాగా ఉంది.

4. శ్రీ ప్రతాప్ రెడ్డి – గుంటూరు, శ్రీ పాండు – విజయవాడ, శ్రీ చిన్న – కొత్తగూడెం, శ్రీ వెంకటస్వామి – హైదరాబాద్

ప్రశ్న : మొదటిసారి లక్కీ డిప్ ద్వారా సేవల కేటాయింపు తరువాత, మిగిలిన సేవ టికెట్లు రెండవసారి విడుదల చేయడం లేదు?
ఆన్ లైన్ లోనే కాకుండా, కరెంట్ బుకింగ్ ద్వారా కూడా దర్శనం టికెట్లు ఇస్తారా?

ఈవో: మొదటిసారే సేవా టికెట్లు అయిపోతున్నాయి.
సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సిఆర్ఓ వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుంది. ఇది కాకుండా ప్రతిరోజు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు
తిరుపతిలో కేటాయిస్తున్నారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి ఫ్రీ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది.

5. స్వప్న – తెలంగాణ

ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో దొరకడం లేదు, ఆఫ్లైన్లో ఇవ్వండి?

ఈవో : ప్రతిరోజు అంగప్రదక్షిణకు 750 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఇందుకోసం భక్తులు
ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తోంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతోంది.

6. శ్రీ ఆనంద్ – కర్ణాటక, సుదర్శన్ – హైదరాబాద్

ప్రశ్న : భక్తులకు టీటీడీ అందిస్తున్న
అన్న ప్రసాదాలు, వసతి, దర్శనము, క్యూలైన్ల నిర్వహణ, ప్రవచన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఎస్వీబీసీ కన్నడ ఛానల్ లో ఆన్లైన్లో టికెట్ల విడుదల గురించి సమాచారం తెలపండి?

ప్రతి ఆదివారం మధ్యాహ్నం భక్తి, పౌరాణిక చిత్రాలను పునరుద్ధరించండి?

ఈవో: కృతజ్ఞతలు, ఎస్వీబీసీలోని అన్ని చానల్లో ఆన్లైన్ సేవ టికెట్లు విడుదల గురించి తెలియజేస్తాం.

మన పూర్వికులు మనకందించిన రామాయణం, మహాభారతం, భాగవతంలోని జ్ఞానాన్ని భవితరాలకు కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. పౌరాణిక చిత్రాలకు సమయం లేదు.

7.శ్రీ జగదీష్ – నల్గొండ

ప్రశ్న : తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లెటర్లకు బ్రేక్ దర్శనం ఇవ్వడం లేదు?

ఈవో: ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా లెటర్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాల సంఖ్యను తగ్గించడం జరుగుతుంది.

8.శ్రీ హరి కిరణ్ – బెంగళూరు

ప్రశ్న : క్యూ లైన్ లలోని అత్యవసర గేట్ల ద్వారా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది బయటవారిని పంపుతున్నారు. అదేవిధంగా లడ్డు కౌంటర్ల వద్ద పక్కనుండి వచ్చి తీసుకు వెళుతున్నారు. దీనివలన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు?

ఈవో : అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నాం.

9. సత్య – రాజమండ్రి
శ్రీ రమణ – ఖమ్మం

ప్రశ్న : తిరుప్పావడ సేవను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి?

ఆర్జిత సేవ టికెట్లకు ముందు లక్కి డిప్ టికెట్లు విడుదల చేస్తున్నారు, మొదట లక్కీ డిప్ టిక్కెట్లు విడుదల చేస్తే బాగుంటుంది?

ఈవో : తిరుప్పావడ సేవ ఆన్లైన్లో లేదు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మాత్రమే తీసుకోవాలి, అవి బుక్ అయిపోయాయి.
పరిశీలిస్తాం.

10. శ్రీ ప్రవీణ్ – కరీంనగర్

ప్రశ్న : తిరుపతి, తిరుమలలో లాకర్ సౌకర్యం పెంచండి?

ఈవో: తిరుమలలో ఇప్పటికే నాలుగు పీఏసీలు ఉన్నాయి, మరో పిఎసి నిర్మాణంలో ఉంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కావున అందుకు తగ్గట్టుగా లాకర్ల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తాం.

11. సరోజ – కర్నూల్

ప్రశ్న: కళ్యాణ కట్టలు తలనీలాలు తీసే క్షురకులు డబ్బులు అడుగుతున్నారు?

ఈవో: తిరుమలలో డబ్బులు ఇవ్వకండి. ఎవరైనా
డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

12. రమణ – ఖమ్మం
ప్రశ్న : కళ్యాణోత్సవం చేసుకున్న గృహస్థులకు ఇచ్చే పెద్ద లడ్డు, వడ పునరుద్ధరించండి?

ఈవో : శ్రీవారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఉచిత లడ్డు ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. లడ్డు కౌంటర్ల వద్ద అదన లడ్డూలు కొనుగోలు చేయవచ్చు.

13. శ్రీనివాస్ – కర్నూల్

ప్రశ్న : శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం ఆన్ లైన్ లో దొరకడం లేదు. గతంలో టిటిడి కళ్యాణ మండపంలో టికెట్స్ ఇచ్చేవారు, తిరిగి ప్రారంభించండి?

ఈవో : నేడు ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం వలన ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం. తిరుపతిలో నేరుగా వచ్చి ఆఫ్ లైన్లో టికెట్లు తీసుకోవచ్చు.

14. శ్రీ సర్వేశ్వరరావు – ఏలూరు

ప్రశ్న: శ్రీవాణి టికెట్లు ఎలా పొందాలి?

ఈవో: ఆన్ లైన్, ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ పాస్ చూపించి, తిరుమల జేఈవో క్యాంప్ ఆఫీసులో శ్రీవాణి టిక్కెట్లు పొందవచ్చు.

15. శ్రీ పరశురాం – అనంతపురం

ప్రశ్న : అన్నమయ్య కీర్తనలను పుస్తక రూపంలో తీసుకురండి.

ఈవో : అన్నమయ్య కీర్తనలు16వ శతాబ్దంలోనివి, వాటిని అర్థం చేసుకోవడం కష్టం. టీటీడీ 20 మంది ప్రముఖ పండితులతో అన్నమయ్య కీర్తనలలోని అర్థ- తాత్పర్యాలతో పుస్తకాలను రూపొందిస్తుంది. ఇప్పటికే 1000 సంకీర్తనలు అర్థ – తాత్పర్యాలతో ప్రచురించడం జరిగింది.

16. శ్రీ శంకర్ గౌడ్. – హైదరాబాద్

ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్రవచనం దర్శన టికెట్లు మూడు నెలల ముందు విడుదల చేయడం వల్ల దాదాపు పది శాతం మంది రావడం లేదు, వారికి క్యాన్సల్ చేసుకుని అవకాశం కల్పించండి?
వైకుంఠ ఏకాదశి టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?

ఈవో: దర్శనం టికెట్లు పొందిన భక్తులు క్యాన్సిల్ చేయడం లేదు.
వైకుంఠ ఏకాదశికి డిసెంబర్ లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లు విడుదల చేస్తున్నాం.

17. శ్రీ రమణ – విశాఖపట్నం. శ్రీ దివాకర్ – హైదరాబాద్

ప్రశ్న : వయోవృద్ధులు మోకాళ్ల నొప్పులు కీళ్ల ఆపరేషన్లు చేసుకున్న వారిని ప్రత్యేకంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోండి?

సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వయసు 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది?

ఈవో: పరిశీలిస్తాం.

18. శ్రీ బాలకృష్ణ –

ప్రశ్న : తిరుమలలో ధర్మ రథాలు ఆపినా ఆపడం లేదు. లగేజీ, పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం.

ఈవో: ధర్మ రథాలు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు వస్తుంది. బస్ స్టాప్స్ వద్ద ఆపుతారు.

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ ఓ శ్రీ నరసింహ కిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.