ONLINE VIRTUAL KALYANOTSAVA SEVA IN SRI PAT SOON _ తిరుచానూరులో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభం
Tirupati, 1 February 2021: TTD is all set to introduce on-line virtual Kalyanotsava Seva in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor soon on the lines of Virtual Kalyanam at Srivari temple in Tirumala.
The Kalyanotsava Seva will be performed in the temple from Monday to Friday and the cost of Virtual Kalyanotsava Seva ticket is Rs.500 on which two persons will be allowed. The devotees shall witness the Seva live on SVBC.
The Grihasta devotees shall avail darshan of Ammavaru through Rs.100 Special Entry queue line within 90 days from the date of booking of seva, free of cost. They will be issued pradasams, one upper cloth, one blouse piece and Akshinthalu after availing darshan.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరులో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభం
తిరుపతి, 2021 ఫిబ్రవరి 01: తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో త్వరలో ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం నుండి శుక్రవారం వరకు వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్ ధరను రూ.500/-గా నిర్ణయించారు. గృహస్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు. ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం ఒక ఉత్తరీయం, ఒక రవికె, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.