ONLY 400O DEVOTEES PER HOUR ALLOWED- ADDNL EO _ టైంస్లాట్ భ‌క్తుల ద‌ర్శ‌న క్యూ లైన్ల‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 17 Mar. 20: TTD Additional Executive Officer, Sri AV Dharma Reddy today said that on Tuesday only 4000 devotees are given time slot tokens in one hour and sent for Srivari darshan directly in the allotted time slots.

Devotees in queue lines are also requested to wear masks and also keep sanitising materials with them.

Inspecting the Anti corona virus initiatives taken by the TTD at VQC 1 and 2 he said the waiting halls in the Vaikuntam queue complex are closed for now in view of Corona threat. Devotees are also advised to wear masks and sanitise their hands.

The Additional EO said the Anna Prasadam Complex, Kalyanakatta, Srivari temple, CRO, are all being cleaned with disinfectants for every two hours.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

టైంస్లాట్ భ‌క్తుల ద‌ర్శ‌న క్యూ లైన్ల‌ను ప‌రిశీలించిన టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి  

తిరుమల, 2020 మార్చి 17: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి టైంస్లాట్ టోకెన్లు పొందిన భ‌క్తుల క్యూ లైన్ల‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి విస్తృత చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలలో థర్మల్ స్క్రీనింగ్, అలిపిరి చెక్‌పాయింట్ నుండి తిరుమ‌ల‌కు వ‌చ్చే వాహ‌నాల‌పై శానిటైజ్‌ చేస్తున్నామ‌న్నారు.  

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు ఒక గంట‌కు 4 వేల టోకెన్లు జారీ చేస్తున్నామ‌న్నారు. త‌ద్వారా భ‌క్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మ‌రియు 2ల‌లో  వేచి ఉండ‌కుండా నేరుగా శ్రీవారి దర్శనాన్ని క‌ల్పిస్త‌న్న‌ట్లు తెలిపారు. క్యూ లైన్ల‌ను ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో శుభ్రం చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యం, కళ్యాణకట్ట, అన్నప్రసాద భవనం, వ‌స‌తి గృహ‌లు, అతిథి భ‌వ‌నాలు, పిఏసిలు తదితర ప్రాంతాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశుభ్రం చేస్తున్నార‌న్నారు.

తిరుమ‌ల‌లో ప్ర‌తి నిత్యం వేలాది మంది భ‌క్తులు ఉంటారు కావున జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌వారు ద‌య‌చేసి త‌గ్గిన త‌ర్వాత మాత్ర‌మే తిరుమ‌ల‌కు రావాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

అనంత‌రం అద‌న‌పు ఈవో క్యూలైన్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
   
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.