OP SERVICES TO RESUME IN BIRRD FROM MAY 4 ONWARDS _ సోమవారం నుంచి బర్డ్ ఓపీ సేవలు

Tirupati, 2 May 20: The Out Patient services will resume in TTD run BIRRD Ortho speciality hospital from May 4 onwards as the Centre has relaxed lockdown restrictions on OP services. 

According to the Director of BIRRD Dr Madanmohan Reddy, the services will be resumed following all the norms prescribed by Government while registering and treating patients. 

Briefing on the arrangements he said, the OP tickets will be generated in five counters from 8am to 12 noon from Monday onwards. All the patients with OP tickets will be provided medication. 

Both the Doctors and patients have to wear masks and strictly observe social distancing, maintaining three feet distance in between. Initially the patients will be tested for Corona Virus in the ground floor.

After this test, patients without positive symptoms will be allowed to enter OP ward along with attendees. At one go only ten will be allowed and after their treatment another ten will be allowed”, he added.  

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సోమవారం నుంచి బర్డ్  ఓపీ సేవలు

తిరుప‌తి, 2020 మే 02: బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి  ఓపీ సేవలు పునః ప్రారంభించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది.  లాక్డౌన్  నుంచి ఓ పీ సేవలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5 కౌంటర్ల ద్వారా ఓ పీ టికెట్లు జారీ చేస్తామని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి  తెలిపారు. ఓ పీ చీటీ తీసుకున్న వారందరికీ వైద్య సేవలు అందిస్తామన్నారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా వైద్యులు, రోగులు మాస్క్ లు వేసుకుని, మూడు అడుగుల దూరం పాటిస్తామని చెప్పారు. మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో రోగులకు కరోనా లక్షణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లక్షణాలు లేని  10 మంది రోగులను సహాయకులతో పాటు  ఓ పీ వార్డు లోకి అనుమతిస్తామన్నారు. డాక్టర్ల సేవల తర్వాత వారందరినీ బయటకు పంపి, మళ్లీ 10 మందిని లోనికి అనుమతించేలా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.