OUR PRIORITY IS FOR SARVA DARSHAN ONLY-TTD _ స‌ర్వ‌ద‌ర్శ‌నానికే టిటిడి ప్రాధాన్య‌త‌

Tirumala, 12 Sep. 20: Reiterating that its first priority is for common pilgrim devotees, TTD stated that it will resume free Sarva Darshan tokens for common devotees to enjoy Srivari darshan as early as possible.

However, TTD stated that it has temporarily stalled SSD tokens in view of spreading of corona in temple city.

TTD clarified that it had recently resumed issue of 3000 Slotted Sarva Darshan (SSD) tokens at Tirupati. However, it was suspended following concerns expressed by local public representatives and denizens on the spike of Covid virus in the temple city with the anticipated influx of ten to twelve thousand devotees from Tamil Nadu in the sacred Peritasi month.

TTD said it had added the suspended 3000 offline tokens for online booking by enhancing the quota of Rs 300 special Darshan tickets.

TTD appealed to devotees to co-operate in view of continued Covid-19 restrictions. Even the Rs 300 special Darshan ticket holders will also be allowed in Sarva Darshan only and appealed that devotees should make note of TTDs efforts.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌ర్వ‌ద‌ర్శ‌నానికే టిటిడి ప్రాధాన్య‌త‌

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 12: సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం చేయించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని టిటిడి తెలియ‌జేస్తోంది. తిరుప‌తిలో కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వ‌చ్చి ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాక స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ జారీని పున‌రుద్ధ‌రిస్తామ‌ని వెల్ల‌డించింది.

తిరుప‌తిలోని కౌంట‌ర్ల ద్వారా రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌డానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుప‌తిలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్నందువ‌ల్ల మొద‌టిసారి టోకెన్ల జారీని నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్పుడు పెర‌టాసి మాసం ర‌ద్దీ దృష్ట్యా టికెట్ల జారీని తాత్కాలికంగా నిలుపుద‌ల చేసింది. తిరుప‌తిలో రోజుకు 3 వేల స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయ‌గా, త‌మిళ‌నాడు నుంచి 10 వేల నుండి 12 వేల మంది భ‌క్తులు క్యూలైన్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి తిరుప‌తిలో కోవిడ్ వ్యాప్తి పెరిగిపోయే ప్ర‌మాద‌ముంద‌ని కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు, స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వ‌చ్చింది. అయితే ర‌ద్దు చేసిన 3 వేల స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్ల‌ కోటాను ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నానికి కేటాయించ‌డం జ‌రిగింది. అంతేగానీ, సామాన్య భ‌క్తుల‌పై టిటిడికి ఎలాంటి ఇత‌ర ఆలోచ‌నా లేదు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు తీసుకున్నవారికి కూడా స‌ర్వ‌ద‌ర్శ‌న‌మే జ‌రుగుతోంది కానీ మ‌రొక‌టి కాదు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.