OVER 69THOUSAND TICKETS FOR FEBRUARY 2020 IN ON-LINE _ ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala, 01 Nov 19 ; TTD has released 69,512 arjitha seva tickets in on-line for the month of February 2020 on Friday.

This includes 10,112 tickets in on-line dip and 59,400 in general category. The electronic dip seva tickets includes, 7,332 Suprabhatam, 120 Tomala, 120 Archana, 240 Astadala Pada Padmaradhana, 2,300 Nijapada Darshanam. While under general category, 2000 Visesha Puja, 13,300 Kalyanam, 4,200 Unjal Seva, 7,700 Arjitha Brahmotsavam, 15,400 Vasanthotsavam, 16,800 Sahasra Deepalankara Seva tickets.

NOVEMBER QUOTA OF Rs.300 SED TICKETS

TTD will release November Quota of Rs.300 Special Entry Darshan tickets in on-line on November 5. The devotees can book these tickets in on-line, e-darshan counters and also in post offices.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఆన్‌లైన్‌లో  69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

తిరుమల, 01 న‌వంబ‌రు 2019 ;శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్ర‌వ‌రి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

 ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,112 సేవా టికెట్లు ఉన్నాయి. ఇందులో సుప్రభాతం 7,332, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 59,400 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జితబ్రహ్మోత్స‌వం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయి.

న‌వంబ‌రు 5న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఫిబ్ర‌వ‌రి కోటా విడుదల

భక్తుల సౌకర్యార్థం 2020 ఫిబ్ర‌వ‌రి నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 5న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.