PADMAVATHI BLESSES IN DARBAR RAJAGOPALA ALANKARAM ON CHINNA SESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై దర్బార్ రాజ గోపాలుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

Tirupati, 30 Nov. 21: Sri Padmavati ammavaru triumphed on Chinna Sesha Vahana in Darbar Rajagopala alankaram on Tuesday, the first day of ongoing annual Brahmotsavam of Sri Padmavati Ammavari Temple of Tiruchanoor being held in Ekantha as per covid guidelines.

The first vahana of the Brahmotsavam, Chinna Sesha vahana heralded that Sri Padmavati ammavaru was Lok Mata. Of entire humanity. The Darshan of Sri Padmavati blessed devotees with prosperity, health and peace.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Temple archaka Sri Babu Swamy, Temple inspector Sri Rajesh and other officials were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చిన్నశేష వాహనంపై దర్బార్ రాజ గోపాలుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 30: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన మంగ‌ళ‌వారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు దర్బార్ రాజ గోపాలుడి అలంకారంలో పిల్లనగ్రోవి, రాజదండం ధరించి గోవులను రక్షిస్తూ చిన్న‌శేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యం వ‌ద్ద గ‌ల వాహ‌న మండ‌పంలో అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా నిర్వహించారు.

మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, విజివో శ్రీ మనోహర్, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.