PADMAVATHI DEVI AS ANDAL SRI GODA DEVI MUSES DEVOTEES _ పల్లకీపై గోదాదేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగ
Tiruchanoor, 15 Nov. 20: On the fifth day of ongoing annual Navahnika Karthika Brahmotsavams at Tiruchanoor, Goddess Sri Padmavathi Devi decked as Andal Sri Goda Devi mused devotees on Sunday morning.
The Pallaki Utsavam was held at Vahana Mandapam between 8am and 9am in Ekantam.
Both Pedda Jiyar and Chinna Jiyar Swamijis of Tirumala, Ex-officio board member of TTD Dr C Bhaskar Reddy, JEO Sri P Basanth Kumar, DyEO Smt Jhansi Rani were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పల్లకీపై గోదాదేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగ
తిరుపతి, 2020 నవంబరు 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం ఉదయం పల్లకీపై గోదాదేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, విఎస్‌వో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, విఐలు శ్రీ సురేష్ రెడ్డి, శ్రీ మహేష్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.
2 గొడుగులు విరాళం
తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు 2 గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద జెఇఓ శ్రీ పి.బసంత్ కుమార్ కు అందించారు. వీరు 18 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజు గొడుగులు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.