PADMAVATHI PARINAYAM CONCLUDES IN TIRUMALA_ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

Tirumala, 26 April 2018: The three-day Padmavathi Parinayam concluded in Tirumala on a grand note in Tirumala on Thursday evening.

Lord Malayappa Swamy reached the well decorated Astalakshmi Parinaya Mandapam on Garuda vahana while His two consorts Sridevi and Bhudevi on separate Tiruchis.

After Edurkolu, Varanamayiram and Pubantata, the deities were placed on a swing and Unjal Seva was performed. The vedic pundits recited Rig, Yajurveda, Sama and Adharvana Vedas followed by melodious rendition of Annamacharya Sankeertans by the project artists.

Meanwhile the decorations of the mandapam by Pune based Sri Venkateswara Religious Charity stood as a special attraction during the entire event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

ఏప్రిల్‌ 26, తిరుమల 2018: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం గురువారం నాడు తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర పెండ్లి వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. నాదస్వరం కళాకారులు నీలాంబరి, భూపాల, మధ్యమావతి తదితర రాగాలను పలికించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య కీర్తనలు వినిపించారు.

ఈ వేడుక ముగిసిన తరువాత స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేస్తారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యకమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.