PARINAYOTSAVAM ENTERS SECOND DAY _ అశ్వవాహనంపై వరునిగా అలరించిన శ్రీనివాసుడు
TIRUMALA, 26 APRIL 2026: The three-day annual Padmavati Srinivasa Parinayotsavam entered second day on Sunday.
Sri Malayappa reached Narayanagiri Gardens on Aswa Vahanam while Sridevi and Bhudevi on separate Palanquins.
After a series of traditional Hindu marriage rituals, the deities were seated on swing and Parinayotsavam was performed in a grand manner.
Temple officials and devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అశ్వవాహనంపై వరునిగా అలరించిన శ్రీనివాసుడు
వైభవోపేతంగా రెండో రోజు పద్మావతి పరిణయోత్సవం
తిరుమల, 2026 ఏప్రిల్ 26: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి.
శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండో రోజైన వైశాఖశుద్ధ దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్త దినమని పురాణ ప్రశస్తి.
కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవాల్లో రెండో రోజుకు ప్రత్యేకత ఉంది.
ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట వేరు వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.
మొదటిరోజు మాదిరే శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరులు భాగవతార్ హరికథ గానం భక్తులను అలరించింది.
ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







