PADMAVATHI PARINAYOTSAVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

Tirumala, 22 May 2021: The annual three-day Padmavathi Parinayotsavams concluded on Saturday in a grand manner at Tirumala.

In view of the Covid pandemic, the Padmavathi Parinayotsavams are being observed in Ekantam in Kalyanotsava Mandapam in Tirumala temple.

On the last day, Sri Malayappa Swamy on Garuda Vahanam flanked by Sridevi and Bhudevi on separate Tiruchis were brought to the Mandapam where the celestial fete was observed with religious fervour.

After the rituals of traditional Hindu marriage, the Veda pundits chanted Chaturveda Mantras followed by the rendition of different raagas including Kalyani, Ananda Bhairavi etc. Through Nadaswaram and later Melam followed.

The event concluded with the melodious rendition of Annamaiah Kristis by Senior artist Smt Bullemma of the Annamacharya Project.

TTD EO Dr KS Jawahar Reddy, Board Members Sri DP Ananta, Sri Sekhar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath, Archakas were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, 2021 మే 22: తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం ముగిశాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్సవాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ‌మండ‌పంలో మ‌ధ్యాహ్నం 4 గంట‌లకు ఈ ఉత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై వేంచేపు చేయగా, వెంట దంత పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అమ్మవారు అనుసరించారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర పెండ్లి వేడుకలు నిర్వహించారు. ఆ తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీ శేఖర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, అర్చకస్వాములు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.