PALAVANAMA COMMENCES ON A “FRUIT”FUL NOTE IN TIRUMALA _ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఫల – పుష్పాలంకరణలు
NAVADHANYA ART AND JANUR ART STEALS THE SHOW
TOOTI-FROOTI DECORATION FOR DWAJAMANDAPAM
Tirumala, 13 Apr. 21: On the auspicious occasion of Plavanama Ugadi, the Garden wing of TTD made spectacular floral decorations which caught the attention of devotees on Tuesday.
Starting from the entrance of the temple till Golden Threshold, the dioramas made of fruits, flowers brought an aesthetic feel of Bhooloka Vaikuntha to the pilgrims.
Matching the occasion, splendid decorations were made in a big way with tonnes of varieties of traditional flowers and thousands of cut flowers. Florists, curtlery artists from Karnataka and AP done decorations with innovative concepts.
On the whole eight tonnes of traditional flowers, 70thousand cut flowers were donated by donors from Hyderabad, Salem while decorations were done by artists from Vijayawada and Bengaluru.
This year unique dioramas using Janur art for the first time were displayed which stood as a special attraction. Janur art is one where the floral decorations are made using Coconut leaves as the supportive background over a steel mesh.
The roof of Dhwaja Mandapam was decked with Tooti-Frooti sky with varieties of fruits, flowers hanging colourfully. Another special attraction was the of Sri Lakshmi Narasimha Swamy made of Navadhanayas. The Dasavataras in watermelon also remained a cynosure inside the temple while the elephants, Sri Krishna Leela outside the temple caught the attention of pilgrims.
Garden Superintendent of TTD Sri Srinivasulu supervised the arrangements.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఫల – పుష్పాలంకరణలు
తిరుమల, 2021 ఏప్రిల్ 13: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా రూపొందించారు.
శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీ మహావిష్ణువు దశవతారాలు, మొదటిసారిగా టెంకాయ ఆకులతో జనూర్ ఆర్ట్‌తో రూపొందించిన కళాకృతులు, నవదాన్యాలతో సిద్ధంచేసిన శ్రీ లక్ష్మీ నరసంహస్వామివారి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో ఐరావతాలు (ఏనుగులు), ఉగాది ప్రారంభం పౌరాణిక నేపథ్యం, చిన్ని కృష్ణుడు మామిడి కాయలు కోస్తున్నసెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టిటిడి ఉద్యానవన విభాగం సిబ్బంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నైపుణ్యం గల 100 మంది నిపుణులు భక్తులను ఆకట్టుకునేలా వినూత్నంగా అలంకరణలు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 70 వేల కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలు అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.